• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan speech: ఏపీలో మున్సిపాలిటిల్లో అభ్యర్థులకు కూటమి నేతలు నామినేషన్లు వేయనివ్వడంలేదని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన సీఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారన్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 23, 2026, 12:17 PM IST|Updated: Oct 23, 2026, 12:49 PM IST
joinshare
YS Jagan:  ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా  వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: chandrababunaidu(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!

టైగర్‌ ష్రాఫ్‌కు చికిత్స అందిస్తోన్న తెలుగు వైద్యుడు.. ఎవరీ డాక్టర్ వెంకటేష్ మోవ్వ ..!

2

Anandiben Patel Comments: "ప్రియురాలిని తల్లిని చేసి వదిలేయోద్దు" ఉత్తరప్రదేశ్ మహిళా గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!

3

Andhra Pradesh: మహిళ ఖైదీ బిడ్డకు సెంట్రల్ జైల్లో బారసాల.. ఏపీలో వెల్లివిరిసిన మానవత్వం .!.

4

Ishan Kishan Ruled Out: రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్..?

5

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan slams on cm Chandrababu naidu govt: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఆ తర్వాత నామినేషన్లపై తీవ్ర దుమారం రాజుకుంది.  పలు చోట్ల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఇతరులు అడ్డుకున్నారు. ఏకంగా నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించి మరీ అభ్యర్థుల నామినేషన్లు చింపివేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారని వైఎస్ జగన్ ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఏపీ సీఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఏపీ కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

నిజంగానే ఎన్నికల వ్యవస్థ దిగజారిపోకపోతే.. ఎలాంటి అడ్డంకులు లేకుండా మా వైయస్ఆర్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయడానికి అనుమతించండి. - @ysjagan అన్న.. #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #JaganannaConnects https://t.co/OLmzt9ZisB

— Jagananna Connects (@JaganannaCNCTS) October 23, 2026

 

ఏపీలో చంద్రబాబు ప్రజాస్వామ్యాంను ఖునీ చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా చేస్తున్న ఘటనల్ని ఆధారాలతో సహా తాము సుప్రీంకోర్టుకు అందజేశామన్నారు. సుప్రీంకోర్టు కూటమికి ప్రభుత్వంకు మొట్టికాయలు వేసిన కూడా ఎస్ ఈసీ తీరు మారలేదన్నారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబిత వాయిదా వేయాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. 

తాము చేసిన పిటిషన్ లోని అంశాలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఏపీ సర్కారుకు మొట్టికాయలు వేసిందన్నారు. అడ్డగొలు అసత్యాలు, దాపరికలు,  డ్రామాలు చేస్తున్నారంటూ కూటమి పాలనపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవేళ ప్రజల్లో మీకు అంత విశ్వాసం ఉంటే నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన సీఎం చంద్రబాబు లేదా సీఈసీలో మార్పురాలేదన్నారు. చంద్రబాబు చేతిలో డీజీపీ పూర్తిగా తోలుబొమ్మలా మారాడాంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఐజీ, ఎస్పీలు, కలెక్టర్లుఎవరితో కూడా మార్పురాలేదని  వైఎస్ జగన్ ఆదేదన వ్యక్తం చేశారు.

నామినేషన్లపై  ఇలా అరాచకాలు చేయడం  ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఇది న్యాయమంటూ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేశామని భావిస్తే ప్రజలు గెలిపిస్తారని అన్నారు.  పార్టీ గుర్తుపైఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలంతా ఈ విషయాలను గుర్తు పెట్టుకొవాలన్నారు. ప్రజలు తమకు న్యాయంచేస్తారని భావించిన వారికే పట్టం కడతారన్నారు. ఒక వేళ మంచి చేయకపోతే ప్రజలు వారిని ఓడిస్తారని అన్నారు. కానీ నామినేషన్లను వేస్తుండగా అడ్డుకొవడం ఏంటని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
AP News