Shubhman Gill Double Century: బంతి బ్యాట్‌ను తాకితే చాలు ఫోర్, సిక్సర్. ప్రాక్టీస్‌లో బౌలింగ్ వేసినట్టు బౌలర్లు బంతులు వేయగా.. ఫీల్డర్లు బంతిని తీసుకురావడమే పనిగా ఉన్నట్టు శుభమన్ గిల్ ఆట కొనసాగింది. మైదానం నలువైపులా ఆటగాళ్లను పరుగులు పెట్టిస్తూ బ్యాట్‌తో గిల్ రఫ్ఫాడించాడు. కెప్టెన్ శుభమన్ గిల్ స్వదేశంలో వెస్టిండీస్ బౌలర్లు తేలిపోయారు. డబుల్ సెంచరీతో వీర విధ్వంసం సృష్టించాడు. అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేశాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శుభమన్ గిల్ పరుగుల మోత మోగిస్తున్నాడు. తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన ఆడిన గిల్ రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 117 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. వాటిలో 24 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. వన్డే క్రికెట్ చరిత్రలో గిల్‌దే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ఈ రికార్డు 126 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ పేరిట ఉండేది. ఆ రికార్డును గిల్ తుడిచి పెట్టేశాడు. గిల్‌తో కలిసి బరిలో దిగిన రోహిత్ శర్మ సెంచరీ చేసి వెనుదిరగగా.. తర్వాత కోహ్లీతో కలిసి గిల్ చక్కగా ఆడాడు.
అంతకుముందు గిల్ సెంచరీని 63 బంతుల్లోనే సాధించాడు. అనంతరం మరో వంద పరుగులు చేయడానికి 40 బంతులు మాత్రమే తీసుకున్నాడు. గిల్‌కు వన్డేల్లో ఇది రెండో డబుల్ సెంచరీ. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 149 బంతుల్లో 208 పరుగులు సాధించి తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. డబుల్ సెంచరీల్లో 128 బంతుల్లో మ్యాక్స్‌వెల్ మూడో స్థానంలో ఉండగా.. 136 బంతుల్లో పాతుమ్ నిసాంక నాలుగు స్థానంలో.. క్రిస్ గేల్ (138 బంతులు) ఐదు, వీరేంద్ర సెహ్వాగ్ (140 బంతులు) ఆరో స్థానాల్లో నిలిచారు.
గిల్ రికార్డులు ఇవే..
ఛేదనలో ఒక జట్టు తరఫున డబుల్ సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా శుభమన్ గిల్ ఘనత సాధించాడు. అంతకుముందు 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో ఆసీస్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 128 బంతుల్లో 201 పరుగులు చేశాడు.
ఈ డబుల్ సెంచరీతో గిల్ రోహిత్, సెహ్వాగ్ సరసన చేరాడు. టీమిండియా తరఫున వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా శుభమన్ గిల్ చోటు దక్కించుకున్నాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు, సెహ్వాగ్ రెండు డబుల్‌సెంచరీలు సాధించారు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రికార్డు మాత్రం ఇప్పటికీ రోహిత్ పేరిట ఉంది.