Asia Cup Rising Stars 2026 Campaign: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత జట్టు అఖండ విజయం సాధించింది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని తేడాతో టీమిండియా విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కుమార్ కుషాగ్ర, తిలక్ వర్మ సెంచరీలతో చెలరేగి ఆడడంతో భారీ స్కోర్ సాధించగా.. ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రానా నిప్పులు చెరిగే బంతులకు ప్రత్యర్థి 26 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇండియా-ఏ జట్టు 306 పరుగులతో ఆఖండ విజయంతో టోర్నీని శుభారంభం చేసింది.
333 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు భారత బౌలర్ల ధాటికి 11.3 ఓవర్లలో 26 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఇండియా-ఏ జట్టు 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కుమార్ కుషాగ్ర (117), తిలక్ వర్మ (107) సెంచరీలతో అదరగొట్టగా.. పేసర్లు ప్రిన్స్ యాదవ్ 5 వికెట్లు, హర్షిత్ రానా 4 వికెట్లతో నేపాల్‌ను కుప్పకూల్చారు. ఏ స్థాయిలో భారత్‌తో నేపాల్ పోటీకి నిలబడలేదు. ఈ విజయంతో భారత్ పైచేయి సాధించింది.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో టాస్ గెలిచిన నేపాల్ బౌలింగ్ ఎంచుకోగా.. మొదట భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసి నేపాల్‌కు చుక్కలు చూపించింది. యువ బ్యాటర్ కుమార్ కుషాగ్ర భారీ సెంచరీతో చెలరేగి ఆడగా.. భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీలతో దుమ్మురేపాడు. 102 బంతుల్లో 117 పరుగులతో కుషాగ్రా కుమ్మేశాడు. 10 ఫోర్లతో దూకుడుగా ఆడి.. 5 సిక్సర్లు నమోదు చేశాడు. 113 బంతుల్లో 107 పరుగులు చేసిన హైదరాబాదీ తిలక్ వర్మ.. 6 ఫోర్లు, 4 ఫోర్లతో చెలరేగి ఆడాడు. ఓపెనర్‌గా దిగిన వైభవ్ సూర్యవంశీ 26 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ (9), ఆయుశ్ బదౌనీ (2) సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రింకూ సింగ్ (9), షాబాద్ అహ్మద్ (8) కొంత స్కోర్ చేయగా.. ఆఖరులో సూర్యాంశు షెగ్డే 36 పరుగులు చేసి స్కోర్ బోర్డును 300 మైలురాయి దాటించాడు.
అగ్ర జట్టు భారత్‌తో ఆడుతున్నా నేపాల్ బౌలర్లు ఏమాత్రం బెదరలేదు. భారత బ్యాటర్లను దెబ్బతీసేందుకు ప్రయత్నించి కొంత సఫలమయ్యారు. వికెట్లు భారీగా తీసినా స్కోర్‌ను మాత్రం నియంత్రించలేకపోయారు. కుషాగ్ర, తిలక్ వికెట్లు తీసేలోపే జరగాల్సిన పెద్ద నష్టమే జరిగిపోయింది. కెప్టెన్ సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షీ మూడు చొప్పున వికెట్లు తీసి అదరగొట్టారు. నందన్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. పవన్ షరాఫ్ ఒకటి పడగొట్టాడు.
బ్యాటింగ్‌కు దిగకముందే భారీ లక్ష్యాన్ని చూసి నేపాల్ బ్యాటర్లు తేలిపోయారు. మైదానంలోకి దిగిన అనంతరం నిమిషం సేపు కూడా ఉండలేక వెనుదిరిగారు. ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రానా బౌలింగ్ దెబ్బకు నేపాల్ బ్యాటర్లు పరుగులు చేయకుండానే ఔటయ్యారు. బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. 11.3 బంతుల్లో 26 పరుగులకు ప్రత్యర్థి నేపాల్ పరిమితమైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇండియా-ఏ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం.
Soaked in the pressure 😇 Delivered a match-winning knock 👊 Kumar Kushagra's stunning Player of the Match performance 🌟 Scorecard ▶️ https://t.co/r7KnQLPzIm #TeamIndia | #INDAvNEP | #RisingStarsAsiaCup https://t.co/8Or9sVt2T4
— BCCI (@BCCI) November 20, 2026