SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IND vs NZ Highlights: వన్డేల్లో భారత్ అదిరే ఆరంభం.. కోహ్లీ విధ్వంసంతో న్యూజిల్యాండ్‌పై భారీ విజయం

Team India Beat New Zealand By 5 Wickets: టీ20 సిరీస్‌ను దక్కించుకున్న భారత జట్టు వన్డేలోనూ అదరగొట్టింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ విజయాన్ని అందుకుని టీమిండియా శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరోసారి కివీస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 04, 2026, 04:09 PM IST | Updated: Nov 04, 2026, 05:02 PM IST
Image Credit: Source: BCCI X (Twitter)
Join

Team India Won By 5 Wickets: న్యూజిల్యాండ్‌ పర్యటనలో భారత జట్టు మరోసారి సత్తా చాటింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. భారత బౌలర్ల విజృంభణకు అతి తక్కువ స్కోర్‌కే న్యూజిల్యాండ్‌ బ్యాటర్లు చాప చుట్టేయగా.. విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌తో తుఫాను ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ భారీ విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఐదు మ్యాచ్‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో మాదిరి వన్డే సిరీస్‌ను టీమిండియా గొప్పగా ప్రారంభించింది. ఆక్లాండ్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ ప్రత్యర్థి న్యూజిల్యాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 40.2 బంతుల్లో 185 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. భారత్‌ బౌలింగ్‌ దెబ్బకు ఒక్కరూ కూడా వన్డేలో అర్ధ సెంచరీ పూర్తి చేయలేదు. టిమ్‌ సీఫర్ట్‌ 43 బంతుల్లో చేసిన 38 పరుగులే అత్యధిక స్కోర్‌. బ్లెయిర్‌ టిక్నర్‌ (34), గ్లెన్‌ ఫిలిప్స్‌ (30) కొన్నేసి పరుగులు చేయగా.. డేరిల్‌ మిచెల్‌ 28 స్కోర్‌ నమోదు చేశాడు. ఇక విల్‌ యంగ్‌ (9), హెన్రీ నికోలస్‌ (9), టామ్‌ లాథమ్‌ (3), కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (4), నథన్‌ స్మిత్‌ (1), కేల్‌ జేమీసన్‌ (1) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఆఖరులో బ్లెయిర్‌ టిక్నర్‌తో కలిసి జాకబ్‌ డఫీ విలువైన 15 పరుగులు చేశాడు.

వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టడంతో కివీస్‌ తక్కువ స్కోర్‌కు పరిమితమైంది. టీ20 సిరీస్‌తో పోలిస్తే వన్డేల్లో భారత బౌలర్లు పొదుపుగా బంతులు వేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేశారు. సీనియర్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీసి న్యూజిల్యాండ్‌ను భారీ దెబ్బతీశాడు. గుర్నర్‌ బ్రార్‌ మూడు వికెట్లతో అదరగొట్టగా.. అన్షుల్‌ కాంబోజ్‌ రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన దిగిన భారత్‌ ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. పదే పదే వర్షం ఆటంకం కలిగించడంతో పలుమార్లు లక్ష్యాన్ని పునఃపరిశీలించారు. డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం ఎంపైర్లు లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. భారత్‌ ఆ లక్ష్యాన్ని 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది. వన్డేలో అందరి దృష్టి స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ప్రదర్శన ఉండగా.. అతడు డకౌట్‌ కావడం తీవ్ర నిరాశపర్చింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ 56 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఒక్క సిక్సర్‌ కూడా బాదని గిల్‌ ఐదు ఫోర్లు నమోదు చేశాడు. అనంతరం మైదానంలోకి దిగిన విరాట్‌ కోహ్లి తనదైన శైలిలో ఆడుతూ భారీ స్కోర్‌ చేశాడు. 35 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ మొత్తం 51 బంతుల్లో 74 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 80వ అర్ధ సెంచరీ. శ్రేయస్‌ అయ్యర్‌ 15 పరుగులకు పరిమితమవగా.. అక్షర్‌ పటేల్‌ డకౌట్‌ కాగా.. కేఎల్‌ రాహుల్‌ (3*), నమన్‌ ధిర్‌ (5*) లక్ష్యం పూర్తి చేశారు. 

పదే పదే వర్షం ఆటంకం కలిగించడంతో బంతి తిరగడంతో న్యూజిలాండ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. జాకబ్‌ డఫీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. నథన్‌ స్మిత్‌, కేల్‌ జేమిసన్‌ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు. న్యూజిల్యాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇరు జట్ల మధ్య ఏడో తేదీన శనివారం వెల్లింగ్టన్‌లో రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES