• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Abhishek Sharma: అభిషేక్ శర్మను ఊరిస్తున్న 3 రికార్డులు.. రేపు తొలి టీ20లో బద్దలు కొడతాడా?

Abhishek Sharma: అభిషేక్ శర్మను ఊరిస్తున్న 3 రికార్డులు.. రేపు తొలి టీ20లో బద్దలు కొడతాడా?

IND vs WI First T20, Abhishek Sharma, Abhishek Sharma Records, Team India, West Indies, Subhman Gill, Virat Kohli, Pocket, Cricket, వెస్టిండీస్‌ వర్సెస్‌ భారత్‌, అభిషేక్‌ శర్మ, శుభమన్‌ గిల్‌, బీసీసీఐ, Tomorrow Abhishek Sharma Likely To Create These 3 Records In India vs West Indies First T20 | Abhishek Sharma: అభిషేక్ శర్మను ఊరిస్తున్న 3 రికార్డులు.. రేపు తొలి టీ20లో బద్దలు కొడతాడా? IND vs WI: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు రేపటి నుంచి టీ20 సిరీస్‌ ఆడబోతున్నది. వన్డేలో మాదిరి పొట్టి సిరీస్‌లోనూ భారీ స్కోర్‌ ఆడాలని భారత ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతుండగా.. అందరి కళ్లు అభిషేక్ శర్మపై పడ్డాయి. ఈ టీ20లో అభిషేక్‌ మూడు రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 05, 2026, 11:36 PM IST|Updated: Oct 05, 2026, 11:44 PM IST
joinshare
Abhishek Sharma: అభిషేక్ శర్మను ఊరిస్తున్న 3 రికార్డులు.. రేపు తొలి టీ20లో బద్దలు కొడతాడా?
Image Credit: Source: Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Abhishek Sharma: అభిషేక్ శర్మను ఊరిస్తున్న 3 రికార్డులు.. రేపు తొలి టీ20లో బద్దలు కొడతాడా?

Abhishek Sharma: అభిషేక్ శర్మను ఊరిస్తున్న 3 రికార్డులు.. రేపు తొలి టీ20లో బద్దలు కొడతాడా?

2

Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌.. రూ.1,10,250 'దసరా బోనస్‌'

3

Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్.. ట్రైలర్‌లో వచ్చిన చివరి సెకండ్స్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం!

4

Harish Rao: బియ్యం, పప్పు, నూనె ధరలు పెరుగుతుంటే రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు?

5

Operation Trishul: తిరుపతిలో ఆపరేషన్ త్రిశూల్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Abhishek Sharma Records: వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు పూర్తి ఉత్సాహం మీద ఉండగా.. సిరీస్‌ కోల్పోయి ఆఖరి మ్యాచ్‌ను గెలిచి పరువు కాపాడుకున్న విండీస్‌లు రేపటి నుంచి టీ20 సిరీస్‌ ఆడనున్నాయి. విండీస్‌పై పూర్తి ఆధిపత్యం భారత జట్టు ప్రదర్శిస్తోంది. ఆటగాళ్లు అందరూ భారీ స్కోర్‌ చేయాలనే కసితో ఉండగా.. అందరి కళ్లు మాత్రం అభిషేక్‌ శర్మపై పడ్డాయి. అభిషేక్‌ను మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రేపు విండీస్‌తో లక్నో వేదికగా భారత జట్టు తలపడనుంది. పొట్టి క్రికెట్‌లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్‌ రేపు జరగనున్న మ్యాచ్‌లో మూడు రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. 2000 టీ20 అంతర్జాతీయ పరుగుల మార్క్‌ను అభిషేక్‌ అందుకోనున్నాడు.

భారత్‌, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జరుగుతున్న ఈ తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్‌ బాదాలనే ప్రయత్నంలో అభిషేక్‌ ఉన్నాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీతో కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ ఊచకోత కోయగా అదే స్థాయి ప్రదర్శన చేయాలని అభిషేక్‌ చూస్తున్నాడు. ఆసియా క్రీడలు 2026 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అర్ధ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించిన అభిషేక్‌ శర్మ.. రేపు జరగనున్న టీ20 సిరీస్‌లో బ్యాట్‌ రఫ్ఫాడించాలని అభిషేక్‌ ఎదురుచూస్తున్నాడు.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ 61 ఇన్నింగ్స్‌లు ఆడి ఇప్పటివరకు 1,926 పరుగులు చేశాడు. 2 వేల పరుగుల మైలురాయిని దాటడానికి 74 పరుగులు బాదాల్సి ఉంది. ఆ రికార్డును తొలి మ్యాచ్‌లోనే సాధించే అవకాశాలు ఉన్నాయి. 2024లో జింబాబ్వేపై టీ20లో ఎంట్రీ ఇచ్చిన బ్యాటర్‌ అభిషేక్‌.. రేపు జరగనున్న తొలి టీ20లో ఆ స్కోరు సాధిస్తే 2000 టీ20ఐ పరుగులు పూర్తి చేసిన ఆరో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డును రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ సాధించారు.

బౌండరీలతో రికార్డు
ధనాధన్‌ ఇన్నింగ్స్‌లో ఆడే అభిషేక్‌ శర్మ మరో రికార్డును నమోదు చేసే అవకాశం ఉంది. సిక్సర్లు, బౌండరీలు బాదుతూ ప్రేక్షకులకు వినోదం అందించే అభిషేక్‌ టీ20ఐల్లో అతడి ఖాతాలో ప్రస్తుతం 185 బౌండరీలు ఉన్నాయి. రేపు లక్నోలో జరగనున్న మ్యాచ్‌లో అభిషేక్‌ మరో ఏడు ఫోర్లు కొడితే కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లను అధిగమించి భారత బ్యాటర్లలో అత్యధిక టీ20ఐ ఫోర్లు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.

వెస్టిండీస్‌తో తొలి టీ20లో ఇంకా 31 పరుగులు చేస్తే టీ20ఐల్లో 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా అభిషేక్‌ నిలుస్తాడు. ఈ రికార్డు సాధ్యమైతే ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా నిలవనున్నాడు. అంతకుముందు ఈ జాబితాలో స్టార్‌ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. లక్నోలో జరిగే తొలి మ్యాచ్ అభిషేక్‌కు కేవలం సిరీస్ ఆరంభం మాత్రమే కాదు.. ఒకే ఇన్నింగ్స్‌లో మూడు కీలక మైలురాళ్లకు చేరువయ్యే అవకాశం కూడా ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

టీ20లో అభిషేక్ ప్రదర్శన
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అభిషేక్‌ శర్మ పలు ఘనతలు సాధించాడు. 37.26 సగటుతో 969 పరుగులు చేయనుండగా.. స్ట్రైక్‌రేట్ 214.85గా ఉంది. వీటిలో రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News
Cricket
Team India
BCCI