SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసం.. ఈ చిచ్చర పిడుగు బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!!

Vaibhav Suryavamshi: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మైదానంలో ఓ సునామీలా విరుచుకుపడ్డాడు. బుడ్డోడు అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. తక్కువ స్కోరు ఛేదనలోనే డబుల్ సెంచరీతో విరుచుకుపడటం అందనినీ విస్మయానికి గురి చేసింది. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో ప్రపంచ రికార్డులన్నింటినీ బ్రేక్ చేశాడు. దోహా వేదికగా జరిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ తో పట్టపగలే చుక్కలు చూపించాడు. ఒకే మ్యాచ్ లో సరికొత్త ప్రపంచ రికార్డుల్ని సృష్టించాడు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 09:00 IST | Updated: Nov 25, 2026, 09:02 IST
Image Credit: Vaibhav Suryavamshi (Source/ZEE Telugu News)
Join

Vaibhav New Records: ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నమెంటులో ఇండియా లిస్ట్-ఎ తరఫున వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసం అద్భుతాన్ని ఆవిష్కరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుపై ఏడు వికెట్లతో విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది. వన్డే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న UAE టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 249 పరుగులు  చేసింది. 250 పరుగుల విజయ  లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-A టీమ్, UAE టీమ్ ను బెంబేలెత్తించింది.

52 బంతుల్లో డబుల్ సెంచరీ..

చిన్న వయస్కుడు 15 ఏళ్ల ప్రతిభావంతుడు వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి  List A క్రికెట్ రికార్డులను తిరగరాశాడు. ప్రపంచ స్థాయిలో 28 సిక్సర్లు, ఏడు ఫోర్లతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు.  28 బంతుల్లో సూర్యవంశీ అత్యంత వేగవంతమైన 'లిస్ట్ ఏ' సెంచరీ,  40 బంతుల్లో అత్యంత వేగవంతమైన 150 పరుగులు,  52 బంతుల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ  రికార్డులను సొంతం చేసుకున్నాడు.

ఐదు ఓవర్లలోనే శతకం..

ఇండియా లిస్ట్-ఎ ను టీమ్ తొలి ఐదు ఓవర్లలోనే వంద పరుగులు చేరుకున్న జట్టుగా క్రికెట్ రికార్డుల్లో అగ్రస్థానంలో నిలిపాడు. సెమీఫైనల్స్ అర్హత సాధనలో వైభవ్ సూర్యవంశీ ఆటతీరే ఓ హైలైట్.   ఛేజింగ్ పూర్తిగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీదేనని ఆటను చూసిన వారంతా అభినందనలతో ముంచెత్తారు. 53 బంతులను ఎదుర్కొన్న వైభవ్ 204 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి, లిస్ట్ 'ఎ' రికార్డులను తిరగరాశాడు.   రికార్డు స్థాయిలో 28 సిక్సర్లు, ఏడు ఫోర్లు బాదాడు.  

దోహాలో జరిగిన మ్యాచ్ తో ఇండియా-ఎ టీమ్ సెమీఫైనల్ మ్యాచ్ కు అర్హత సాధించింది. లిస్ట్ ఏ క్రికెట్‌ లో వేగవంతమైన సెంచరీ కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. తనకుముందు జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో 29 బంతుల్లో సెంచరీ కొట్టిన రికార్డు ఉంది. ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డులన్నింటినీ వైభవ్ బ్రేక్ చేశాడు.  

టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్..  
వైభవ్‌ సూర్యవంశీ .. ఐపీఎల్‌  2025కు ముందు ఈ టీనేజ్‌ క్రికెటర్‌ పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఐపీఎల్‌ తర్వాత పరిస్థితి మారిపోయింది. సంచలన ఇన్నింగ్స్‌తో, మెరుపు సెంచరీలతో ఈ యువ బ్యాటర్‌  టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ గా మారిపోయాడు. ఐపీఎల్‌లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతి పిన్న వయసులో  14 ఏళ్ల 23 రోజుల వయసులో  అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ గతేడాది ఐపీఎల్‌ మెగా వేలంలో ఒక కోటి పది లక్షల ధర పలికాడు.  

సూర్యవంశిదీ వ్యవసాయ కుటుంబం..

బిహార్ రాష్ట్రానికి చెందిన సూర్యవంశీది  వ్యవసాయకుటుంబం. 2011 మార్చి 27వతేదీన పుట్టాడు. స్వస్థలం సమస్తిపూర్ జిల్లా తాజ్ పూర్ . తల్లి ఆర్తి సూర్యవంశి, తండ్రి సంజీవ్. నాలుగేళ్ల వయస్సులో ఉన్నపుడే క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్న సూర్యవంశిని తండ్రి సంజీవ్ గుర్తించి ప్రోత్సహించాడు. వంశీ వయసు పెరిగే కొద్దీ మంచి ట్రైనింగ్ ఇప్పిస్తే... క్రికెట్లో రాణిస్తాడని భావించిన తండ్రి సంజయ్ మోతీపూర్ లో ఉన్న వ్యవసాయ పొలాన్ని అమ్మేసి క్రికెట్ శిక్షణ ఇప్పించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సంజీవ్..  వంద కిలోమీటర్ల దూరంలో క్రికెట్ వనరులున్న పాట్నా ప్రాంతంలో శిక్షణకు చేర్చాడు. పాట్నాలోని జెనెక్స్ క్రికెట్ అకాడమీలో కోచ్ మనీష్ ఓజా చేత శిక్షణ తర్ఫీదు పొందాడు. బిహార్ తాజ్ పూర్ లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్లో 9వతరగతి చదువుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ చదువుకుంటూ... క్రికెట్లో ప్రతిభావంతుడిగా రాణిస్తున్నాడు.

రంజీ మ్యాచుల్లో అరంగేట్రం..

క్రికెట్లో శిక్షణ పొందిన తర్వాత తొలిసారిగా 12ఏళ్ల వయసులో రంజీ మ్యాచుల్లో ఆరంగేట్రం చేశాడు. 2024 జనవరిలో రంజీ క్రికెట్లో రాణించిన వైభవ్ సూర్యవంశీ అండర్ 19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో ఆడిన ఆటలో 58 బంతులతో అద్భుతమైన సెంచరీ కొట్టిన పిన్నవయస్కుడిగా రికార్డు నమోదు చేశాడు. 2024 ఆసియాకప్ క్రికెట్లోనూ అద్బుతమైన ఆటతీరును కనబరిచాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో  తన తొలి మ్యాచ్‌ ఆడాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచి అందర్నీ విస్మయానికి గురి చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం మీద 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు.

మెరుపు సెంచరీలు.. 
గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌కు 28 ఏప్రిల్ 2025న మ్యాచ్‌ జరిగింది. ఇది వైభవ్‌కు కేవలం మూడో మ్యాచ్‌. కానీ అతడు ఈ టీ20లో మెరుపు సెంచరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఔరా అనిపించాడు. మొత్తం మీద 38 బంతుల్లో 101 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇందులో 4 ఫోర్లు, 11 సిక్స్‌లున్నాయి. కుర్రాళ్ల తడాఖా.. సీనియర్ల ధమాకా. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌, అండర్‌-19లో.. ఈ టీనేజ్‌ థండర్‌.. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌లో ఇండియా- ఎ తరఫున యూఏఈపై 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 15 సిక్స్‌లు ఉండడం విశేషం.

వైభవ్‌ సూర్యవంశీ.. 15 ఏళ్లు నిండకముందే టీ20ల్లో మూడో సెంచరీ సాధించడం విశేషం. అంతకు ముందు ఐపీఎల్ 2025, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లోనూ వైభవ్ శతకాలతో చెలరేగాడు. తాజాగా ‘విజయ్‌ హజారే’లో.. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా.. రాంచి వేదికగా   బిహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ వైభవ్‌ సూర్యవంశీ సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డ్‌ సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్‌  84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్‌లతో 190 పరుగులు నమోదు చేశాడు. తృటిలో డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

పిన్న వయసులోనే త్రిబుల్ సెంచరీ.. 
వైభవ్ సూర్యవంశీ పిన్నవయస్సులోనే అద్భుతమైన రికార్డును సొంతంచేసుకున్నాడు. బీహార్లో జరిగిన రంధిర్ వర్మ టోర్నమెంటులో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీ పిన్నవయస్సులోనే అద్భుతమైన రికార్డును సొంతంచేసుకున్నాడు. బీహార్లో జరిగిన రంధిర్ వర్మ టోర్నమెంటులో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

క్రికెట్లో అద్బుతమైన ఆటతీరుతో రాణిస్తున్న వైభవ్ సూర్యవంశీ... అండర్ 19 వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. టీమిండియా తరఫున క్రికెట్ జట్టుకు ఎంపికై సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇపుడు ఇండియా లిస్ట్ -ఎ తరఫున అరబ్ ఎమిరేట్స్ టీమ్ బౌలర్ల బంతుల్ని తుత్తునియలు చేశాడు. సూర్య వంశీ తన ఆటతీరుతో భవిష్యత్తులో సరికొత్త రికార్డుల్ని తిరగరాస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. స్టైలిష్ ఆటశైలితో ఇండియన్ క్రికెటర్ గా ఆటకే వన్నెతెచ్చి, మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్ధాం..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES