• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IPL 2027 Retention Live: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. రిటెన్షన్‌లో ఏ ప్లేయర్‌? ఏ జట్టు తెలుసా?
Live Now

IPL 2027 Retention Live: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. రిటెన్షన్‌లో ఏ ప్లేయర్‌? ఏ జట్టు తెలుసా?

IPL 2027 Retention LIVE Updates Star Players Changed Teams: ఐపీఎల్‌ తదుపరి సీజన్‌ అత్యంత ఆసక్తికరంగా ఉండనుంది. రాబోయే సీజన్‌ కోసం టోర్నీలోని అన్నీ ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదులుకోవడం.. అట్టి పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. వచ్చే నెలలో వేలం జరగనుండగా.. ఈ సందర్భంగా ఏ జట్లు ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకున్నాయి? వదులుకున్నాయో లైవ్‌ అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 17, 2026, 16:00 IST|Updated: Nov 20, 2026, 13:16 IST
joinshare
IPL 2027 Retention Live: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. రిటెన్షన్‌లో ఏ ప్లేయర్‌? ఏ జట్టు తెలుసా?
Image Credit: IPL 2027 Retention LIVE
17 Nov 2026 20:49 IST
share

IPL 2027 Retention Live Updates.. ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి వివరాలు ఇవే

ఐపీఎల్ లో రిటెన్షన్.. వదులుకున్న జట్ల ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

The wait is over... Presenting the official list of retained players ahead of #TATAIPL 2027 📋 #TATAIPLAuction https://t.co/pBhvTpDG1X

— IndianPremierLeague (@IPL) November 17, 2026

17 Nov 2026 20:19 IST

IPL Retension: ఒక్కరే.. అయినా పర్స్‌ నిండా

కలకత్తా నైట్‌రైడర్స్‌ జట్టు ఒక్కరినే వదిలేసుకుని.. అందరు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. మతీశ పథిరనను కలకత్తా వదిలేసుకుంది. అయినా కూడా కలకత్తా వద్ద రూ.41.55 కోట్లు డబ్బులు మిగిలి ఉన్నాయి.

17 Nov 2026 20:16 IST

IPL 2027 Retention Live: ఇద్దరు మాత్రమే

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇద్దరిని మాత్రమే వదిలేసుకోగా.. ఆ జట్టు వద్ద రూ.27.05 కోట్లు మిగిలి ఉన్నాయి. మిగిలిన డబ్బులతో వచ్చే నెలలో జరగనున్న వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.

17 Nov 2026 20:15 IST

IPL 2027 Retention Live: భారీగా మిగిల్చుకున్న లక్నో

రిటెన్షన్‌లో భాగంగా లక్నో సూపర్‌ జియాంట్స్‌ ముగ్గురు ఆటగాళ్లను వదిలేసింది. అవేశ్‌ ఖాన్‌, నోకియా, వనిందు హసరంగను విడుదల చేయగా.. లక్నో వద్ద అత్యధికంగా రూ.47.45 కోట్లు మిగిలి ఉన్నాయి.

17 Nov 2026 19:41 IST

IPL 2027 Retention Live: గుజరాత్‌ నుంచి ముగ్గురు రిటెన్షన్‌

గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ రిటెన్షన్‌లో భాగంగా కీలక ఆటగాళ్లు షారుక్‌ ఖాన్‌, ఇశాంత్‌ శర్మ, ల్యూక్‌ వుడ్‌ను వదిలేసుకుంది. ముగ్గురిని వదిలేసుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద రూ.8.75 కోట్లు డబ్బులు మిగిలాయి.

17 Nov 2026 19:36 IST

IPL 2027 Retention Live: ధోనీతోపాటు ముగ్గురు ఔట్‌

ఐపీఎల్‌లో సీనియర్‌ జట్టుగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)లో కీలక మార్పు జరిగింది. జట్టు పుట్టుక నుంచి ఫ్రాంచైజీకి సారథ్యం వహించిన స్టార్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీని చెన్నై వదులుకుంది. ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు పలికాడు. ఇక అతడితోపాటు మ్యాట్‌ హెన్రీ, కుల్దీప్‌ యాదవ్‌, మాథ్యూ షార్ట్‌ను కూడా చెన్నై జట్లు వదిలేసుకుంది.

17 Nov 2026 19:36 IST

IPL 2027 Retention Live: అత్యధికంగా ఆరుగురిని వదులుకున్న ఢిల్లీ

ఢిల్లీ క్యాపిటల్స్‌ అత్యధికంగా ఆరుగురిని వదిలేసుకుంది. వారిలో స్టార్‌ ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌తోపాటు నితీశ్‌ రాణా, అభిషేక్‌ పొరెల్‌, బెన్‌ డకెట్‌, నిశాంక, కరుణ్‌ నాయర్‌ ఉన్నారు. వీరిని వదులుకోవడం ద్వారా ఢిల్లీ వద్ద రూ.39.5 కోట్లు మిగిలాయి.

17 Nov 2026 19:25 IST

IPL 2027 Retention Live: పంజాబ్‌ నుంచి ముగ్గురు ఔట్‌

పంజాబ్‌ కింగ్స్‌ వచ్చే ఏడాది జరిగే సీజన్‌కు సంబంధించిన కొన్ని మార్పులు చేసుకుంది. ఇక జట్టులోని ఫెర్గూసన్‌, నేహల్‌ వధేరా, ప్రవీణ్‌ దుబేను పంజాబ్‌ వదులుకుంది. వదులుకోవడం ద్వారా పంజాబ్‌ వద్ద రూ.18.6 కోట్లు ఉన్నాయి.

17 Nov 2026 19:21 IST

IPL 2027 Retention Live: ముంబై ఇండియన్స్ వెళ్లిన ప్లేయర్లు వీరే!

ఈ ఏడాది రిటెన్షన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ కీలకమైన ఆటగాళ్లను వదులుకుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లతోపాటు ఏఎం ఘజన్‌ఫర్, అథర్వ అంకోలేకర్, కేశవ్ మహారాజ్, మహ్మద్ ఐజార్, డానిష్ మలేవార్, మయాంక్ మార్కండే, మయాంక్ రావత్‌లను ముంబై ఇండియన్స్ జట్టు వదిలేసింది.

17 Nov 2026 18:57 IST

IPL 2027 Retention Live: బెంగళూరు వదులుకున్న ఆటగాళ్లు

రిటెన్షన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కీలక ఆటగాళ్లను వదిలేసింది. వేలానికి ముందు ఆర్‌సీబీ ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. జాకబ్ బెథెల్, రిచర్డ్ గ్లీసన్, మంగేశ్ యాదవ్, విహాన్ మల్హోత్రా, సాత్విక్ దేశ్వాల్ బెంగళూరు జట్టు నుంచి బయటకు వచ్చేశారు.

17 Nov 2026 17:51 IST

Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌

దాదాపు రెండు దశాబ్దాల ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎంఎస్‌ ధోనీ వీడ్కోలు పలికారు. చెన్నై జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన ధోనీ ఇకపై ఎల్లో జెర్సీ తరఫున గ్రౌండ్‌లో కనిపించడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో మాత్రం అనుబంధం కొనసాగించనున్నాడు. జట్టు మెంటర్‌గా వ్యవహరిస్తారని ఫ్రాంచైజీ ప్రకటించింది. ఐపీఎల్‌ 2027 సీజన్‌లో ధోనీ మెంటర్‌గా అతడి మార్గదర్శకత్వంలో చెన్నై జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

17 Nov 2026 16:57 IST

IPL Retention Live Updates: మళ్లీ పాత గూటికి పంత్‌

ఐపీఎల్‌లో మళ్లీ పాతగూటికి రిషబ్‌ పంత్‌ చేరిపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. 2025 వేలంలో లక్నో రూ.15 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేయగా.. ట్రేడ్ ద్వారా పంత్‌ను రూ.15 కోట్లకు పాత జట్టు ఢిల్లీ సొంతం చేసుకుంది. దీనికి బదులుగా ఢిల్లీ కుల్దీప్ యాదవ్‌ను వదులుకోగా.. రూ.13.5 కోట్లకు లక్నో సూపర్‌ జియాంట్స్‌ దక్కించుకుంది.

17 Nov 2026 16:52 IST

IPL 2027 Retention Live: రాజస్థాన్‌లో చేరిన షమీ

టీమిండియా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ జట్టు మార్పుపై వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఐపీఎల్‌లో షమీ జట్టు మారాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌లో షమీ చేరిపోయాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ మణిమరన్‌ సిద్ధార్థ్‌ కూడా రాజస్థాన్‌ జట్టులోకి రావడం విశేషం. వీరిద్దరిని తీసుకోవడంతో రాజస్థాన్‌ తన వద్ద ఉన్న సామ్‌ కర్రాన్‌ను లక్నో సూపర్‌ జియాంట్స్‌కు ఇచ్చేసింది.

17 Nov 2026 16:35 IST

IPL 2027 Retention: సగానికి హర్షల్‌ పటేల్‌

రిటెన్షన్‌ గడువుకు ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్రేడింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ హర్షల్ పటేల్ గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. రూ.4 కోట్లకు హర్షల్‌ పటేల్‌ను గుజరాత్ దక్కించుకుంది. ఐపీఎల్‌లో 35 ఏళ్ల హర్షల్ పటేల్ ఐదో ఫ్రాంచైజీకి మారాడు. 2025 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8 కోట్లకు కొనుగోలు చేయగా.. సగం ధరకు అంటే రూ.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కు బదిలీ అయ్యాడు.

17 Nov 2026 16:23 IST

IPL 2027 Retention Live: పంజాబ్‌లో చేరిన హార్దిక్‌ పాండ్యా

ఐపీఎల్ రిటెన్షన్‌లో ఈసారి పలు ఫ్రాంచైజీలు కీలక మార్పులు చేసుకున్నాయి. ఫ్రాంచైజీలు ముందే ట్రేడింగ్ చేసుకోగా ట్రేడింగ్ విధానంలో మార్పులు ఇలా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యను వదులుకోగా పంజాబ్ కింగ్స్‌ పట్టేసుకుంది. అర్షదీప్ సింగ్‌ను కూడా పంజాబ్‌ తన ఫ్రాంచైజీలోకి తీసుకుంది.

17 Nov 2026 16:01 IST

IPL 2027 Retention: నేడు ఆఖరు గడువు

ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీకి రిపోర్టు
ఐపీఎల్ 2027కు ముందు మెగా వేలం నిర్వహించడం లేదు. డిసెంబర్ 16వ తేదీన గోవాలో మినీ వేలం జరగనుంది. వేలానికి ముందు నవంబర్ 17వ తేదీలోపు ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితా  ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి సమర్పించాల్సి ఉంది. దీంతో ఐపీఎల్ రిటెన్షన్ జాబితాను ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలు ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే జట్లు వెల్లడిస్తున్నాయి.

ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలు ఇవే
సన్‌రైజర్స్ హైదరాబాద్
చెన్నై సూపర్‌ కింగ్స్‌
ముంబై ఇండియన్స్
పంజాబ్ కింగ్స్‌
గుజరాత్ టైటాన్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఢిల్లీ క్యాపిటల్స్
లక్నో సూపర్‌ జియాంట్స్‌
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌
రాజస్థాన్‌ రాయల్స్‌

Add Zee News as a Preferred Source
TAGS:
IPL
Cricket
Sports News
Telugu News
Trending News

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IPL 2027 Retention LIVE Updates: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్‌ వేలం ప్రక్రియకు ముందు జట్లు ఆటగాళ్లను రిటైన్ చేసుకొని.. మరికొందరు ఆటగాళ్లను వదులుకోవడం జరుగుతుంది. ఐపీఎల్ 2027కు ముందు కూడా ఫ్రాంచైజీలు ఈ ప్రక్రియను చేపట్టాయి. నవంబర్‌ 17వ తేదీ అంటే మంగళవారం లోపు రిటైన్‌ ఆటగాళ్లు.. వదులుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ గడువు విధించింది. ఆ గడువు ముగిసిపోవడంతో ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయి? ఏ జట్లు ఆటగాళ్లను వదులుకున్నాయో తెలుసుకుందాం. ఐపీఎల్‌ రిటైన్షన్‌కు సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.