తెలంగాణాలో వారానికి 5 రోజుల పనిదినాలపై సర్కార్ ఆరా..?
5 Day Work Week: ప్రభుత్వ ఆఫీసుల్లో పనిదినాలను కుదించి వాటి స్థానంలో వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అమల్లోకి తీసుకువచ్చేు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
5 Day Work Week: ప్రభుత్వ ఆఫీసుల్లో పనిదినాలను కుదించి వాటి స్థానంలో వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అమల్లోకి తీసుకువచ్చేు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 6 రోజుల పనిదినాల విధానానికి బదులుగా కేవలం 5 రోజులే విధులు నిర్వహించి.. మిగతా రెండు రోజులు శనివారం, ఆదివారం సెలవు ప్రకటించే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగులు వారానికి 6 రోజులు పనిచేస్తూ, ప్రతిరోజూ 8 గంటల చొప్పున మొత్తం 48 గంటలు సేవలందిస్తున్నారు. అయితే, కొత్తగా పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం.. పనిదినాలను 5 రోజులకు తగ్గించి, ప్రతిరోజూ అదనంగా మరో గంటన్నర పాటు పనివేళలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వల్ల ఉద్యోగులకు వీకెండ్‌లో రెండు రోజుల పాటు పూర్తి విశ్రాంతి దొరుకుతుందని, అదే సమయంలో పని గంటలలో ఎలాంటి కోత పడకుండా చూసేందుకు సీనియర్ అధికారులు సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తున్నారు.
ఎల్ నినో కారణంగా నీరు, విద్యుత్ సరఫరా కష్టంగా మారుతున్నందున.. పనిదినాలను తగ్గించాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ విషయం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్న ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పిల్లల చదువులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఐదు రోజుల పని వారాన్ని, విద్యా సంస్థలకు ఆరు రోజుల పని వారాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
అటు హైదరాబాద్‌లో మంచినీటి సమస్య తీవ్రమవుతోంది. నీటి కొరత కారణంగా, అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయి. అంతేకాకుండా, పనివేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏసీల వాడకం, విద్యుత్ వినియోగం కూడా పెరుగుతున్నాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరోవైపు, నీటి కొరత కారణంగా అనేక కార్పొరేట్ కళాశాలలు, హాస్టళ్లను మూసివేసి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.
Also Read: