Controversy posts on cm revanth reddy and Actress: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సోషల్ మీడియా పోస్ట్ లపై చాలా సీరియస్ గా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై అసభ్యకర పోస్టులను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అదే విధంగా వ్యక్తిత్వ హననంకు పాల్పడుతూ.. కించపర్చే పోస్టులను సైతం చూస్తు ఊరుకోబోమని నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఇటీవల‘డిగ్‌టీవీ తెలుగు (డిగ్‌టీవీ ప్యారడీ)’ పేరుతో ఉన్న ఒక ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి, ఓ నటి చిత్రాలను మార్ఫింగ్ చేసి పోస్టులు చేసిన ఘటన తీవ్రవివాదంగా మారింది. ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా పోస్ట్ ఉందని దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.
దీనిపై టీపీసీసీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి, లాయర్ కైలాశ్ సజ్జన్ హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కంప్లైంట్ లో.. ఉద్దేష్యపూర్వకంగా.. సీఎంను అవమానించడంతో పాటు, నటిని కించపరిచేలా ఈ పోస్ట్ ఉందని రాసుకొచ్చారు.
ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకొవాలని కోరారు. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదు స్వీకరించిన నగర సైబర్ క్రైమ్ పోలీసులు సంబంధిత ఎక్స్ ఖాతా నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు ఇటీవల అపోసిషన్, అధికార పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో ట్విట్ ల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.