SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth reddy: ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలి.. భారత్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

Hyderabad hicc Bharat summit: రెండు శక్తుల మధ్య పోరాటం సాగుతోందని, ఒక శక్తి ప్రజాస్వామ్య పరిరక్షణను కోరుకుంటే మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందంటూ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. చట్టబద్ధ పాలనకు కట్టుబడిఉండాలని చూస్తుంటే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని మరికొన్ని శక్తులు చూస్తున్నాయన్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 14, 2026, 08:24 PM IST | Updated: Nov 14, 2026, 08:32 PM IST
Image Credit: cm revanth reddy in hicc hyderabad summit
Join

CM Revanth reddy speech Bharat Summit 2026  hicc: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ లోని హెఐసీసీలో రెండు రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్ 2026 ను నిర్వహించింది. ఈ కార్యక్రమంకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు జరిగిన హెచ్ఐసీసీ ముగింపు సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులంతా ఏకంకావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజల్లో వ్యక్తమవుతున్న కలలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. డెలిరీంగ్ గ్లోబర్ జస్టిస్ అన్న అంశంపై సీఎం రేవంత్ మాట్లాడారు.

ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా రెండు శక్తుల మధ్య పోరాటం  ఒక శక్తి ప్రజాస్వామ్య పరిరక్షణను కోరుకుంటే మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందన్నారు.  ప్రతి పౌరుడికి ఓటుహక్కు ఉండాలని కోరుకుంటే,నియంతృత్వ శక్తులు కొన్ని వర్గాలకు మాత్రమే ఫలాలు దక్కాలని చూస్తున్నాయన్నారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని తాము భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏకపార్టీ, ఏకవ్యక్తి పాలనకు వ్యతిరేకంగా మనమంతా చర్చలు, సంప్రదింపుల పట్ల విశ్వాసంతో ముందుకు వెళ్తున్నామన్నారు. మనమంతా ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నామని ఏ శక్తి కూడా నిలువరించలేదన్నారు. ప్రపంచీకరణ, కోవిడ్ మహమ్మారి అనంతర పరిణామాల్లో అనేక సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని, లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోని, వారి సమస్యలను  సాకారం చేయాలని ఆశాభావంతో ఉన్నరన్నారు. అందరు బాధ్యతతో, కలిసి కట్టుగా ఉంటే వీటిని పరిష్కరించుకొవచ్చన్నారు. భారత్ సమ్మిట్  సదస్సుకు దాదాపుగా.. 70 దేశాల నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కొందరికి వీసాలను నిరాకరించిందని, అయినప్పటికీ చాలా మంది వివిధ మధ్యామాలతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి రోజున ఈ సమ్మిట్ నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES