• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 'పిచ్చికుక్కలు కరిచాయా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు!

సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 'పిచ్చికుక్కలు కరిచాయా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు!

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వం బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేల తీరును సీఎం రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు.

Written ByBhoomi
Published: Nov 20, 2026, 08:59 IST|Updated: Nov 20, 2026, 09:00 IST
joinshare
సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 'పిచ్చికుక్కలు కరిచాయా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు!
Image Credit: CM Revanth Reddy

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వం బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేల తీరును సీఎం రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి వారిని పిచ్చికుక్కలు కరిచాయా అని ప్రశ్నించారు రేవంత్. అటువంటివారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలిస్తారంటూ హెచ్చరించారు. గురువారం సిద్ధిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కొంతమంది నేతలు మైకుల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం పనితీరును ప్రశంసిస్తున్నారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. మంచి విషయాలను మైకుల్లోనే చెప్పాలి.. లోపాలను మాత్రం వ్యక్తిగతంగా చర్చించాలి. కానీ కొంతమంది దీనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ చురకలంటించారు. సీఎం తన ప్రసంగంలో ఎవరి పేర్లనూ కూడా నేరుగా ప్రస్తావించినప్పటికీ.. ఇటీవల నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

ఇదే సభలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో సిద్ధిపేటలో హరీశ్ రావును ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. 10ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో  కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను కొల్లగొట్టిందని ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై కేసీఆర్, హరీశ్ రావులతో అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇక ఈ వేదిక నుంచే ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ ను సీఎం ప్రారంభించారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Also Read: 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Congress
Telugu News