SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రేపే సీఎం సిద్ధిపేట పర్యటన..ఉచిత చీరల పంపిణీ, రూ.5 లక్షల బీమా పథకాలకు శ్రీకారం..!!

CM Revanth Reddy: తెలంగాణలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల జీవిత బీమా భరోసా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్ ను అమలు చేయాలని నిర్ణయించారు

Written By Bhoomi
Published: Nov 18, 2026, 14:02 IST | Updated: Nov 18, 2026, 14:05 IST
Image Credit: CM Revanth Reddy
Join

CM Revanth Reddy:  తెలంగాణలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల జీవిత బీమా భరోసా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్ ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న రూ. 2లక్షల జీవిత బీమా మొత్తాన్ని రూ. 5లక్షలకు పెంచారు. దీంతోపాటు రూ. 10లక్షల వరకు ప్రమాద బీమాను యథాయతథంగా కొనసాగించాలని   అధికారులను ఆదేశించారు. ఈ స్కీమ్ కు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఈ నెల 19వ తేదీన సిద్ధిపేటలో సీఎం స్వయంగా విడుదల చేయనున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆర్థిక, ప్రణాళిక, సీఎంఓ ఉన్నతాధికారులతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలతోపాటు లక్షలాది మంది కుటుంబాలకు ఈ బీమా స్కీమ్ కొండంత అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పలు శాఖల పరిధిలో ఇప్పటికే లబ్ది పొందుతున్నవారిలో ఏ ఒక్కరినీ తొలగించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజలు దరఖాస్తుల కోసం ఇబ్బంది పడకుండా అన్ని గ్రామ పంచాయితీల్లోనే ఫారాలు అందుబాటులో ఉంచాలని.. పల్లెపల్లెనా విస్త్రుత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు. పథకాల అమలు కార్యాచరణపై కలెకర్లతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శని సీఎం ఆదేశించారు.


రాష్ట్రంలోని అర్హులైన పేద మహిళలందరికీ పండుగ కానుకగా ఉచితంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గిడ్డంగులలోని చీరల నిల్వలను వెంటనే అన్ని జిల్లా కేంద్రాలకు తరలించి.. అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. చీరల నాణ్యతలో ఏమైనా వ్యత్యాసం ఉన్నా లేదా వాటి పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Also Read: 

 

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ రద్దుపై కీలక అడుగు..త్వరలో ప్రత్యేక అధ్యయన కమిటీ..!!

 

 

ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలుపై సీఎం హామీ.. కానీ జీవో ఇప్పుడే ఇవ్వాలి: శ్రీపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES