హైదరాబాద్‌ను కమ్మేస్తున్న దట్టమైన పొగమంచు.. అనూహ్యంగా మారిన ఉష్ణోగ్రతలు.. ఐఎండీ అలెర్ట్!
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 16 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో అత్యల్పంగా 14.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana Cold Wave Alert: నవంబర్ నెల ప్రారంభంతో తెలంగాణలో చలి పెరిగింది. కొన్ని రోజులుగా వర్షాలు తగ్గిపోయి పొడి వాతావరణం నెలకొంది. దీంతో రాత్రి, ఉదయం వేళల్లో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. తెల్లవారుజామున బయటకు రావడానికి ప్రజలు చలికి జంకుతున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల క్రితం వరకు ఎండ, ఉక్కపోతతో ఉన్న పరిస్థితులు ఉండగా, నిన్నటి నుంచి చలికాలానికి సంబంధించిన వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చలికాలం ప్రారంభమై ఇప్పటికే 20 నుంచి 25 రోజులు అయినప్పటికీ, ఇంతవరకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యాయి. అయితే నిన్నటి నుంచి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చలికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఉదయం నుంచే చల్లటి వాతావరణం ఉంటోంది, దానికి తోడు చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వానాకాలం మొదలైనప్పటి నుంచి వాతావరణంలో విభిన్నమైన మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో, అసలు ఈ చలికాలంలో చలి ఉంటుందా? లేదా? అనే సందేహాలు ఉండేవి. ఎందుకంటే చలికాలం ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచినా, దాని ప్రభావం కనిపించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండేవి, రాత్రివేళల్లో కూడా కొంత వేడి ఉండేది. అయితే ఇప్పుడు అనూహ్యంగా శీతాకాలపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 16 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో అత్యల్పంగా 14.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. తెల్లవారుజామున రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్ కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం ఎండ మోస్తరుగా ఉన్నప్పటికీ, సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి చల్లటి గాలులు మొదలవుతున్నాయి. నగరంలో ఒక రకమైన వాతావరణం ఉంటే, శివారు ప్రాంతాల్లో మరో రకమైన వాతావరణం కనిపిస్తోంది. నగరంలో ఉష్ణోగ్రత కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
Read Also: ఏపీకి మళ్లీ వర్షాల గండం.. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. అధికారులు ఏమంటున్నారంటే?
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో మొత్తం నాలుగు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, అవి ఆదిలాబాద్ జిల్లా పుట్నూరు ఏజెన్సీ, ములుగు జిల్లా ఏటూరునాగారం, ఖమ్మం జిల్లా భద్రాచలం, మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాంతాలు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మిగతా ప్రాంతాల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.