Mla Rammohanreddy forgets cm revanth reddy name in Telangana assembly session: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య తగ్గా ఫార్ వార్ నడుస్తుంది. అన్నిపార్టీలు కూడా పదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సభలో మాట్లాడారు. ఏకంగా సీఎం రేవంత్ పేరును మర్చిపోయారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ శీనన్నను సీఎంను చేసిన రామ్మోహన్ రెడ్డి https://t.co/d1kiADvCUh pic.twitter.com/0Qn6CWIO4S— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మాట్లాడి ఒక్కసారిగా సవరించుకున్నారు. దీంతో అప్పటి వరకు జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి మర్చిపొవడం నెట్టింట వైరల్ గా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిన కూడా.. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి రెండున్నరేండ్లు అవుతున్నా ఆయన పేరును క్యాబినెట్ మంత్రులు, సొంత పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు సైతం మర్చిపోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపేరును అల్లు అర్జున్ మర్చిపోయాడని పెద్ద రచ్చ రాజుకుంది.తన పేరుమర్చిపోయినందుకు సీఎం రేవంత్ అల్లు అర్జున్ కు చుక్కలు చూపించారని అప్పట్లో ప్రచారంజరిగింది.
ఇది మరవక ముందే మరల ఒక ప్రైవేటుకార్యక్రమంలో యాంకర్ ఇదే తప్పిందం చేశాడు. తాజాగా.. సొంత పార్టీకి చెందిన
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎం రేవంత్ పేరును మర్చిపొవడంతో రచ్చ రాజుకుంది. దీనిపై బీఆర్ఎస్ సీఎం రేవంత్ ను ట్రోల్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులకు, సీనియర్ నేతలకు కూడా సీఎం ఎవరో తెలియదా..? అని నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.