Danam Nagender: దానం నాగేందర్ అనర్హత వివాదం కేసు.. రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. కారణం ఇదే..
Mla disqualification case on danam nagender: దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో దీనిపై అత్యున్నత ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.
Danam nagender mla disqualification case adjourned tomorrow: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం దానం నాగేందర్ అనర్హత పిటిషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఆయనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దీనిపై విచారణ జరగాల్సి ఉండగా.. లిస్ట్ కాలేదు. దీంతో దానం నాగేందర్ కేసుపై విచారణ రేపు(గురువారం) జరగనుంది. ఈ మేరకు కోర్టు రిజిస్ట్రీ ప్రకటించారు. దీంతో దానం కేసులో సుప్రీంకోర్టు ఏవిధమైన ఉత్తర్వులు ఇస్తుందో అన్నదానిపై మరింత ఉత్కంఠ నెలకొంది.
పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు అనర్హత వేటును దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై దానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన విషయం తెలిసిందే.
తొలుత ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్ 23) విచారించాల్సి ఉంది. తెలంగాణ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను గురువారం విచారించనుంది.
అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. దీనిపై దానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. దానంపై అనర్హత వేటు వేస్తూ ఇటీవల తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే.