• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Dasara Special Trains: దసరా, దీపావళి పండగ సీజన్‌లో తెలుగు ప్రజలకు శుభవార్త..ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..!

Dasara Special Trains: దసరా, దీపావళి పండగ సీజన్‌లో తెలుగు ప్రజలకు శుభవార్త..ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..!

Dasara SCR Special Trains: పండుగ సీజన్‌లో తెలుగు ప్రజలకు శుభవార్త: చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు దసరా, దీపావళి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ముఖ్యనగరాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Written ByHarish Darla
Published: Oct 16, 2026, 06:03 AM IST|Updated: Oct 16, 2026, 06:09 AM IST
joinshare
Dasara Special Trains: దసరా, దీపావళి పండగ సీజన్‌లో తెలుగు ప్రజలకు శుభవార్త..ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala Bike Ban: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..రెండు రోజులు ఘాట్ రోడ్లపై ఆ వాహనాలు నిషేధం!

Tirumala Bike Ban: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..రెండు రోజులు ఘాట్ రోడ్లపై ఆ వాహనాలు నిషేధం!

2

Ranabaali Twitter Review: 'రణబాలి' మూవీ ట్విట్టర్ రివ్యూ..మాస్ పాత్రలో విజయ్ దేవరకొండ 'రుద్ర తాండవం'!

3

Dasara Special Trains: దసరా, దీపావళి పండగ సీజన్‌లో తెలుగు ప్రజలకు శుభవార్త..ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..!

4

‘జైలర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజినీకాంత్ మాస్ రాంపేజ్..

5

‘రణబాలి’ ఫస్ట్ డే బుకింగ్స్ థియేటర్స్ కౌంట్.. విజయ దేవరకొండ మూవీ మొదటి రోజు ఎంత రావచ్చంటే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dasara SCR Special Trains: దసరా, దీపావళి పండుగల వేళ ఊరెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నారు. 

స్పెషల్ ట్రైన్ సర్వీసుల వివరాలు..
1) చర్లపల్లి - చెన్నై సెంట్రల్ - చర్లపల్లి సర్వీసు.. 
ఈ స్పెషల్ రైలు 16.10.2026న రాత్రి 9:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17.10.2026న మధ్యాహ్నం 1:00 గంటకు చెన్నై సెంట్రల్ నుంచి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 04:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. ఇందులో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

2) చర్లపల్లి - నాగర్‌కోయిల్ - చర్లపల్లి సర్వీసులు.. 
ఈ స్పెషల్ రైలు 30.10.2026 నుంచి 13.11.2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది రాత్రి 7:45 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి, ఆ తర్వాతి రోజు రాత్రి 10:45 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది (మొత్తం 3 సర్వీసులు). తిరుగు ప్రయాణంలో నాగర్‌కోయిల్ - చర్లపల్లి (రైలు నంబర్ 07536) ప్రత్యేక రైలు 01.11.2026 నుంచి 15.11.2026 వరకు నడుస్తుంది. ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత 00:45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 03:45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధిచలం, తిరుచిరాపల్లి, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూరు, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 2 AC, 3 AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

3) సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ సర్వీసు..
సికింద్రాబాద్ - విశాఖపట్నం ప్రత్యేక రైలు (నంబర్ 07069) 16.10.2026న రాత్రి 8:15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నంబర్ 07070) 17.10.2026న మధ్యాహ్నం 3:50 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 05:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ (1 AC), సెకండ్ ఏసీ (2 AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

టికెట్ బుకింగ్ కోసం ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవడానికి ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్లలో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Telangana News
Telugu News
AP News