• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘జైలర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజినీకాంత్ మాస్ రాంపేజ్..

‘జైలర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజినీకాంత్ మాస్ రాంపేజ్..

Jailer 2 1st Day Box Office Collections Predictions: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’. ఈ గురువారం దసరా కానుకగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ మేరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాలు ఏమంటున్నాయి. బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 05:44 AM IST|Updated: Oct 16, 2026, 05:45 AM IST
joinshare
‘జైలర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజినీకాంత్ మాస్ రాంపేజ్..
Image Credit: Jailer 2 Box office Collections (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala Bike Ban: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..రెండు రోజులు ఘాట్ రోడ్లపై ఆ వాహనాలు నిషేధం!

Tirumala Bike Ban: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..రెండు రోజులు ఘాట్ రోడ్లపై ఆ వాహనాలు నిషేధం!

2

Ranabaali Twitter Review: 'రణబాలి' మూవీ ట్విట్టర్ రివ్యూ..మాస్ పాత్రలో విజయ్ దేవరకొండ 'రుద్ర తాండవం'!

3

Dasara Special Trains: దసరా, దీపావళి పండగ సీజన్‌లో తెలుగు ప్రజలకు శుభవార్త..ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..!

4

‘జైలర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజినీకాంత్ మాస్ రాంపేజ్..

5

‘రణబాలి’ ఫస్ట్ డే బుకింగ్స్ థియేటర్స్ కౌంట్.. విజయ దేవరకొండ మూవీ మొదటి రోజు ఎంత రావచ్చంటే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jailer 2 First Day Collections: సూపర్ స్టార్ రజినీకాంత్  వయసు 70 దాటినా.. యంగ్ హీరోలకు సమానంగా  ధీటుగా తన  చిత్రాలతో అదరగొడుతున్నారు.  డ్యూయట్స్ గట్రా లేకుండా తన వయసును గుర్తు చేసుకుంటూ  తన స్వాగ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ సినిమాలో తన మార్క్ యాక్షన్‌తో అదరగొట్టేసాడు. ట్రైలర్ తర్వాత పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన టాక్‌తో ఈ సినిమా బుకింగ్స్‌ ఊపందుకున్నాయి. ప్రతి చోటా మాస్ రాంపేజ్ చూపిస్తున్నాయి.

జైలర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్’ మూవీ ఎక్కడా ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేశాడు. సీక్వెల్‌కు సంబంధంచిన కథపై బాగానే వర్కౌట్ చేసాడు. పైగా సీనియర్ బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రబర్తి మెయిన్ విలన్‌గా చక్రాల కుర్చీకే పరిమితమైన పాత్రలో తన రేంజ్‌లో అదరగొట్టేశాడు. ఇక  విద్యాబాలన్ కూడా లేడీ విలన్‌గా రజినీకి నటనలో గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. ఇక  ఎస్.జే.సూర్య, సూరజ్ వెంజమూడు విలనిజం పండింది. ఇక మోహన్‌ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, జాకీష్రాఫ్‌ల క్యామియోలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. వారి పాత్రలు పండాయి.

థియేటర్స్ కౌంట్..

జైలర్ 2 తెలుగు రాష్ట్రాల్లో 700 థియేటర్స్‌లో రిలీజైంది. మన దేశంలో మొత్తంగా 2500 స్క్రీన్స్.. ప్రపంచ వ్యాప్తంగా 4 వేల స్క్రీన్స్‌లో విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్న అంచనాలు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్.. 
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలంగాణలో రూ. 18 కోట్లు.. రాయలసీమలో రూ. 6 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 17 కోట్లు.. మొత్తంగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 42 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఇతర భాషల విషయానికొస్తే..

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్..
తమిళనాడులో - రూ. 125 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్లు.. కర్ణాటకలో రూ. 26 కోట్లు.. కేరళ + రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 30 కోట్లు.. ఓవర్సీస్‌లో రూ. 80 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 302 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా రూ. 304 కోట్ల షేర్ (రూ. 600 కోట్ల గ్రాస్)రాబడితే హిట్ అనిపించుకుంటుంది. ఈ సినిమా టాక్ బాగున్నా నేపథ్యంలో ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టం కాదు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News