• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘రణబాలి’ ఫస్ట్ డే బుకింగ్స్ థియేటర్స్ కౌంట్.. విజయ దేవరకొండ మూవీ మొదటి రోజు ఎంత రావచ్చంటే..!!

‘రణబాలి’ ఫస్ట్ డే బుకింగ్స్ థియేటర్స్ కౌంట్.. విజయ దేవరకొండ మూవీ మొదటి రోజు ఎంత రావచ్చంటే..!!

Ranabaali First Day Theatres Count Bookings: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. ఈ సినిమాలో ఆయన నిజ జీవిత భాగస్వామి రష్మిక మందన్న కథానాయికగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా తొలిసారి చారిత్రక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజు ఎంత రాబట్టే అవకాశాలున్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 05:22 AM IST|Updated: Oct 16, 2026, 05:23 AM IST
joinshare
‘రణబాలి’ ఫస్ట్ డే బుకింగ్స్  థియేటర్స్ కౌంట్.. విజయ దేవరకొండ మూవీ మొదటి రోజు ఎంత రావచ్చంటే..!!
Image Credit: Ranabaali Bookings (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala Bike Ban: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..రెండు రోజులు ఘాట్ రోడ్లపై ఆ వాహనాలు నిషేధం!

Tirumala Bike Ban: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..రెండు రోజులు ఘాట్ రోడ్లపై ఆ వాహనాలు నిషేధం!

2

Ranabaali Twitter Review: 'రణబాలి' మూవీ ట్విట్టర్ రివ్యూ..మాస్ పాత్రలో విజయ్ దేవరకొండ 'రుద్ర తాండవం'!

3

Dasara Special Trains: దసరా, దీపావళి పండగ సీజన్‌లో తెలుగు ప్రజలకు శుభవార్త..ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..!

4

‘జైలర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజినీకాంత్ మాస్ రాంపేజ్..

5

‘రణబాలి’ ఫస్ట్ డే బుకింగ్స్ థియేటర్స్ కౌంట్.. విజయ దేవరకొండ మూవీ మొదటి రోజు ఎంత రావచ్చంటే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ranabaali First Day Collections: రౌడీ హీరో విజయ్ దేవరకొండ,  రష్మిక నాయక, నాయికలుగా యాక్ట్ చేసిన చిత్రం ‘రణబాలి’.  పెళ్లి తర్వాత  ఫస్ట్ టైమ్ వెండితెరపై మెరిసారు. విజయ దశమి కానుకగా ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్వాతంత్య్ర సమరయోధుడు శింగనమల రణబాలి పాత్రలో యాక్ట్ చేశాడు. తొలిసారి పీరియాడిక్ పాత్రలో నటించడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఏరియా వైజ్‌గా ఎంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందో ఆ వివరాలను మేకర్స్ వెల్లడించలేదు.

ఈ రోజు విడుదల కాబట్టి రిలీజ్ లెక్కలు గట్రా బయటకు రానున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 700 స్క్రీన్స్‌లో విడుదలవుతుంది. ఇక కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 300 థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్‌లో 400 స్క్రీన్స్..ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా 1400 థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా బుకింగ్స్ అనుకున్నంత రేంజ్‌లో లేవనే చెప్పాలి. కింగ్‌డమ్‌ మూవీతో పోలిస్తే కాస్త తక్కువగానే నమోదు అయినట్టు తెలుస్తుంది. సినిమా ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ బాగున్నా.. ఎందుకో టికెట్స్ అనుకున్నంత రేంజ్‌లో తెగలేదు. ఈ సినిమాకు మౌత్ టాక్ కీలకం కానుంది. మౌత్ టాక్‌ను బట్టి ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా మన దేశంలో రూ. 4.5 కోట్ల రేంజ్‌లో బుకింగ్స్ ఉన్నాయి. ఓవర్సీస్‌‌తో కలిపితే రూ. 8 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయని బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది. తెలుగులో రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల షేర్.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల వరకు రాబట్టే అవకాశాలున్నాయి.

థియేటర్స్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతునట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇండియాలో సినిమా ప్రీ బుకింగ్స్ గ్రాస్ 4.5 కోట్ల రేంజ్ దాకా ఉండగా ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి సినిమా 8 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను ఇప్పటి వరకు అందుకుంది.

దాంతో సినిమా ఇప్పుడు ఎక్కువ శాతం మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కానుండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే మాత్రం మొదటి రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6-8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రేంజ్ నుండి ఆ పైన ఓపెనింగ్స్ ను టాక్ బాగుంటే టార్గెట్ చేయోచ్చు. ఇక సినిమా ఈ అంచనాలను ఎంతవరకు మించుతుందో చూడాలి ఇప్పుడు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ఒక్క కట్ లేకుండా U/A సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం. కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా మాస్ ఆడియన్స్‌‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయనే టాక్ వుంది. మొత్తంగా విజయ్ దేవరకొండకు సినిమాకు కావాల్సింది ప్రేక్షకుల అండ. అది దొరికితే ఈ సినిమా ఈజీగా బాక్సాఫీస్‌ను రఫ్పాడించే అవకాశాలున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News