SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు తెర.. ప్రొబేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని DEOలకు ఆఫీసర్లకు విద్యాశాఖ ఆదేశం..!!

DSC 2024 Teachers Probation: డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. 2024 డీఎస్‌సీ ప్రక్రియ ద్వారా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Written By Bhoomi
Published: Oct 25, 2026, 01:51 PM IST | Updated: Oct 25, 2026, 01:52 PM IST
Image Credit: DSC 2024 Teachers Probation
Join

DSC 2024 Teachers Probation: డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. 2024 డీఎస్‌సీ ప్రక్రియ ద్వారా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక  నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న డీఎస్‌సీ 2024 టీచర్లకు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రొబేషన్‌ డిక్లేర్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్ నికోలస్ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా డీఎస్‌సీ 2024 ఉపాధ్యాయుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియపై తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. కాలపరిమితి పూర్తయినా ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు ఈ సమస్యపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. టీచర్ల నుండి వచ్చిన విజ్ఞప్తులపై వెంటనే స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్.. స్పష్టతనిస్తూ ఉత్తర్వుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఉపాధ్యాయులకు భవిష్యత్తులో ఎలాంటి పరిపాలనాపరమైన లేదా సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాల విద్యాశాఖ సమయానుకూలంగా స్పందించి ప్రొబేషన్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంపట్ల  తెలంగాణ డీఎడ్, బీఎడ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం  ప్రతినిధులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. సంఘం ముఖ్య నాయకులు రామ్మోహన్‌రెడ్డి, వెంకట రమణచారి, మహమ్మద్‌ ఇర్ఫాన్‌ తదితరులు విద్యాశాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒక సంయుక్త ప్రకటనలో అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా.. కేవలం ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా.. ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం అందాల్సిన వార్షిక ఇంక్రిమెంట్‌  బిల్లులను కూడా సకాలంలో తయారు చేసి మంజూరు చేసేలా సంబంధిత విభాగాలు వేగంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది డీఎస్‌సీ 2024 ఉపాధ్యాయులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES