తుపాను ప్రభావంతో తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..
Due To Murasu Toofan Effect: బంగాళాఖాతంలో అర్నాబ్ తుపాను తర్వాత మరో తుపాను ఏర్పడింది. దీనికి మురాసు అనే నామకరణం చేశారు. దీని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణపైనా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Murasu Effect on Telangana: మురాసు తుపాను ఎఫెక్ట్ ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణ పలు జిల్లాలపై పెను ప్రభావం చూపుతోంది. ఇది చెన్నైకి సుమారు 630 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడింది. ఈ రోజు తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు, రేపు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మురాసు ఎఫెక్ట్ తెలంగాణలో పలు జిల్లాలకు ఉంది. దీంతో ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మంగళవారం తెలంగాణలో అత్యంతభారీ వర్ష సూచన..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు వర్షపాతం..
రేపు తుపాను తీరం దాటనుంది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ సూర్యాపేట, జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురువారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడనున్నట్లు సూచించింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.