• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /బాలీవుడ్ ‘కింగ్’ షారుఖ్ నెట్ వర్త్.. మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ ‘కింగ్’ షారుఖ్ నెట్ వర్త్.. మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Shah Rukh Net Worth: షారుఖ్ ఖాన్... ఈ పేరు కంటే బాలీవుడ్ బాద్ షా,కింగ్ ఖాన్,, కింగ్ ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఆఫ్ రొమాన్స్..పేర్లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. అంతేకాదు మన దేశంలో అత్యంత ధనవంతుడైన హీరోగా ఫోర్బ్స్ రికార్డులకు ఎక్కారు. ఈయన సినిమాలతో పాటు వ్యాపార ప్రకటనలు, ఐపీఎల్ ఇలా పలు మార్గాల్లో తన ఆస్తుల విలువను పెంచుకున్నాడు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 10:26 AM IST|Updated: Nov 02, 2026, 10:28 AM IST
joinshare
బాలీవుడ్ ‘కింగ్’ షారుఖ్ నెట్ వర్త్.. మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
Image Credit: Shah Rukh Assets Net Worth (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బాలీవుడ్ ‘కింగ్’ షారుఖ్ నెట్ వర్త్.. మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ ‘కింగ్’ షారుఖ్ నెట్ వర్త్.. మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

2

కార్తీక మాసం ప్రాముఖ్యత.. భక్తులు పాటించాల్సిన నియమాలు..

3

తుపాను ప్రభావంతో తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..

4

APకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న తీవ్ర తుపాను.. పక్క రాష్ట్రాల సాయం కోరిన బాబు..

5

నేడు భాగ్యనగరానికి కేంద్ర హోం మంత్రి.. కాంగ్రెస్, కాక్రోచ్‌లకు చెక్ పెట్టేలా అమిత్ షా మహా పాదయాత్ర..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shah Rukh Khan Assets Value: అవసరం కొందరికి దారి చూపిస్తే.. సాధించాలనే తపన మరికొందరికి  మార్గం చూపిస్తుంది. షారుఖ్ ను మాత్రం ఆ రెండూ కలిసి నడిపించాయి. కొన్ని టీవీ సీరియళ్లతో యాక్టింగ్ స్టార్ట్ చేసిన షారుఖ్.. బాలీవుడ్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. అంతటి స్థాయి ఊరకే రాలేదతనికి. కొన్ని  దశాబ్దాల హార్డ్ వర్క్ రిజల్డ్ ఇది.బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్  కేవలం సినిమాలు మాత్రమే కాదు.. యాడ్స్ తో నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు. అంతేకాదు ఐపీఎల్ కోల్ కతా నైడ్ రైడర్స్‌కి యజమానిగా ఉన్నారు. దాంతో ముంబై తీరంలో ‘మన్నత్’  ఇంటి వాల్యూ కొన్ని వందల కోట్లు ఉంటుంది. మరోవైపు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పలు భార్య గౌరీతో కలిసి నిర్మిస్తున్నారు.అంతేకాదు ముంబైలో వీఎఫ్ఎక్స్‌ స్టూడియో వంటివి ఉన్నాయి. ఇలా సినిమాలు, నిర్మాణం, ఐపీఎల్, స్టూడియోల ద్వారా సంపాదనలో ఎవరికీ అంతనంద ఎత్తులో ఉన్నారు. ఈయన నెట్ వర్త్ ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం రూ. 13 వేల క కోట్ల వరకు ఉంటుందని అంచనా.  

సినిమా ఛాన్స్..

సినిమాల్లో ఒక్కో అవకాశాన్ని.. ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ..నంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అటు ఆ బ్రాండ్‌కు పరిమితం కాకుండా విభిన్న రకాల పాత్రల్లో అలరించారు. హీరోగా.. విలన్‌గా వచ్చిన ప్రతి అవకాశాన్ని నిచ్చెనలా మార్చుకొని ఈ స్థాయికి చేరుకున్నాడు.  

టీవీ నటుడి నుంచి హీరో దాకా.. 
సినిమాల్లోకి రాకముందు కొన్ని టీవీ సీరియళ్ల యాక్టింగ్ తో పేరు తెచ్చుకున్నాడు షారుఖ్. అతనికి ఫస్ట్ చాన్స్ ఇచ్చింది మాత్రం హేమామాలిని. ఆమె డైరెక్షన్ చేసిన దిల్ ఆశ్నా హై.. సినిమా.. కొన్ని కారణాలు వల్ల రిలీజ్ ఆలస్యం అయింది. సెకండ్ చాన్స్ గా ‘దీవాన’ లో  వచ్చింది. రిషికపూర్, దివ్యభారతిలతో పాటు సపోర్టింగ్ రోల్ అది. ఆ సినిమాతోనే లైఫ్ టర్న్ అయింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 

వెయ్యి కోట్ల హీరో.. 

 ఇక షారుఖ్ పైనపోయిందనుకున్న టైమ్‌లో ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపాడు. ఈ యేడాది చివర్లో డిసెంబర్ 24న ‘కింగ్’ మూవీతో పలకరించనున్నాడు. పఠాన్ ఫేమ్  సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో షారుఖ్ కూతురు సుహానే ఖాన్ వెండితెర ఆరంగేట్రం చేయబోతుంది. ఈ రోజు 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న షారుఖ్‌కు జీ మీడియా పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేస్తుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Tollywood
Telugu Movie