• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /సమ్మక్క సారక్క బ్యారేజ్ కోసం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ భేటి..

సమ్మక్క సారక్క బ్యారేజ్ కోసం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ భేటి..

Revanth Vs Vishnu Deo Sai: తెలంగాణలో నిర్మిస్తోన్న భారీ నీటి ప్రాజెక్టులు నిర్మించే విషయంలో పై ఎగువనున్న రాష్ట్రాల నుంచి అనుమతుల కోసం రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికు తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర సీఎంతో భేటి అయిన రేవంత్ రెడ్డి ఈ రోజు సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ విషయంలో ఛత్తస్‌గఢ్ రాష్ట్రం ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్‌తో భేటి కానున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 11:21 IST|Updated: Nov 17, 2026, 13:17 IST
joinshare
సమ్మక్క సారక్క బ్యారేజ్ కోసం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ భేటి..
Image Credit: Revanth Redddy to Meet Vishnu Deo Sai (Source/ZEE News Telugu)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana CM Meets Chhattisgarh CM: ఈ రోజు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ లెటర్ సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బ్యారేజ్ పూర్తయినప్పటికి అంతరాష్ట్ర అనుమతులు లేకపోవంతో  ఆ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో వినియోగంలోకి రాలేదు. ఇదే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.

నవంబర్ 15న ప్రధాని మోదీతో చర్చలు జరిపిన సీఎం రేవంత్..

ఇటీవల కేంద్ర జల సంఘం అంతర్రాష్ట్ర అనుమతులు లేని కారణంగా ప్రాజెక్టు డీపీఆర్‌ (Detailed Project Report)ను వెనక్కి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ అనుమతులు లభిస్తే గోదావరి జలాలను ఉపయోగించుకుని ఎస్సారెస్పీ  రెండో దశ కింద సుమారు 4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు అందుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

అనుమతులు లభిస్తే 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు లభిస్తుందంటున్న సీఎం.. 

అంతే కాకుండా రామప్ప-పాకాల లింక్ కెనాల్ ద్వారా మరో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం కలుగుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నుంచి నేరుగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు  బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర అధికారుల బృందం వెళ్లి ఛత్తీస్‌గ‌ఢ్ అధికారులతో చర్చలు జరపునున్నారు. ఇప్పటికే తుమ్మడిహట్టి విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణ పనుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
National News
Revanth Reddy