• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో పలు మార్పుల మూలంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 07:48 IST|Updated: Sep 26, 2026, 07:52 IST
joinshare
మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..
Image Credit: Telangana Rains (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

2

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

3

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

4

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

5

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IMD Alert to Northen Telangana: ఉత్తర తెలంగాణలో రానున్న రెండు రోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ సమయంలో చెట్ల కింద కానీ..కరెంట్ స్తంభాల దగ్గర, బడా హోర్డింగ్‌ల  నిల్చోవడం కానీ చేయరాదని అధికారులు చెబుతున్నారు.

అల్పపీడనం ఎఫెక్ట్.. 
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం పరిధిలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల  ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జగిత్యాల, జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

‌ఋతుపవనాల ముగింపు..

ఈ రోజు (సెప్టెంబర్ 26) నుంచి ఋతుపవనాలకు సంబంధించిన సీజన్ ముగిసింది. ఈ రోజు నుంచి తెలంగాణలో ఉక్కపోత లాంటి పరిస్థితులు ఉండనున్నాయి.మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావం దాదాపు ముగిసినట్టే. ఈ రోజు, రేపు కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసి ఆగిపోనున్నాయి. ఈ సీజన్‌లో కురిసిన ఈ వర్షాలతో ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో నీటి మట్టాలు, భూగర్భ జలాలు రీఛార్జ్  కావడం కొంతలో కొంత ఊరట అని చెప్పాలి.  

పెరగనున్న ఉష్ణోగ్రతలు.. 
సెప్టెంబర్ 26 నుండి, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణం ఉంటుంది, వర్షాలు తక్కువగా కురుస్తాయి. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.  అయితే చాలా చోట్ల ప్రధానంగా పొడిగానే ఉంటుంది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు తెలంగాణ అంతటా తీవ్రమైన ఉక్కబోత ఉండే అవకాశాలున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 34-36°C వరకు నమోదయ్య అవకాశాలున్నాయి.

ఆ తర్వాత, తూర్పు గాలుల ప్రభావం ..ఈశాన్య రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు కారణంగా అక్టోబర్ 3-10 మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Weather Update
Telangana News