• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Dussehra Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా హలీడేస్ ప్రకటన.. తెలంగాణ విద్యార్థులకు డబుల్ జాక్ పాట్.!.

Dussehra Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా హలీడేస్ ప్రకటన.. తెలంగాణ విద్యార్థులకు డబుల్ జాక్ పాట్.!.

Ap and telangana dussehra holidays: ఏపీతో పాటు, తెలంగాణలో స్కూళ్లకు హలీడేల తేదీలు చాలా భిన్నంగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణ విద్యార్థులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి హలీడేస్ లో ట్రిప్ లకు ఎక్కడకు వెళ్లాలో ప్లాన్ లు సైతం సిద్దం చేసుకున్నారు.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 21, 2026, 07:13 PM IST|Updated: Sep 21, 2026, 07:23 PM IST
joinshare
Dussehra Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా హలీడేస్ ప్రకటన.. తెలంగాణ విద్యార్థులకు డబుల్ జాక్ పాట్.!.
Image Credit: schoolholiday(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dussehra 2026 festival ap and telangana states holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు  దసరా పండగ సెలవులను విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.  ఈ క్రమంలో  ఏపీతో పాటు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ హాలిడేస్ డేట్స్ ఒకేలా లేకపోవడం గమనార్హం. తెలంగాణలోని పాఠశాలలకు 2026 అక్టోబర్ 10 నుంచి 22 వరకు ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 క్యాలెండర్ ప్రకారం సాధారణ స్కూళ్లకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

తెలంగాణలో 13 రోజుల పాటు పండుగ

తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా హాలిడేస్  వచ్చాయి. పండుగ సెలవులకు ముందు అక్టోబర్ 9 చివరి వర్కింగ్ డే కానుంది. సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 23న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అక్టోబర్ 10న సెలవులు ప్రారంభమై, అక్టోబర్ 22న ముగుస్తుండటంతో తెలంగాణ స్టూడెంట్స్ మొత్తం 13 రోజుల లాంగ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజుల దసరా హాలిడేస్

ఆంధ్రప్రదేశ్ 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం జనరల్ స్కూళ్లకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అంటే ఏపీలో విద్యార్థులకు మొత్తం 10 రోజుల పాటు హాలిడేస్ లభిస్తాయి. అయితే క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం ఈ హాలిడే షెడ్యూల్ కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ 13 రోజుల సెలవులు ఉన్నాయనుకోవడం పొరపాటే. తెలంగాణలో 13 రోజులు ఉంటే, ఏపీలోని సాధారణ పాఠశాలలకు మాత్రం 10 రోజులు సెలవులు ఉన్నాయి.

అక్టోబర్ 20న విజయదశమి..

ఈ ఏడాది విజయదశమి పండుగను మనం అక్టోబర్ 20, మంగళవారం రోజున రానుంది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 19న మహర్నవమి, అక్టోబర్ 20న విజయదశమి , అక్టోబర్ 21న విజయదశమి మరుసటి రోజు సెలవుగా పేర్కొన్నారు. 

తెలంగాణలో దసరా వేడుకలతో పాటు బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. దీంతో సెలవుల సమయంలో ఊళ్లలో పండుగ వాతావరణం మరింత గ్రాండ్‌గా ఉండబోతోంది.

దసరా సెలవులకు ముందే SA-1 ఎగ్జామ్స్

తెలంగాణలోని విద్యార్థులకు దసరా సెలవులకు వెళ్లే ముందే సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలు ముగియనున్నాయి. అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి 9 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి.

 ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అక్టోబర్ 5 నుంచి 9 వరకు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 1 నుంచి 9 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నారు. పరీక్షలు పూర్తవ్వగానే అక్టోబర్ 10 నుంచి హాయిగా దసరా సెలవులను ఎంజాయ్ చేయవచ్చు.

స్వగ్రామాలకు వెళ్లేవారికి గోల్డెన్ ఛాన్స్

పట్టణాలు, నగరాల్లో చదువుకుంటున్న విద్యార్థులు , ఉద్యోగులు దసరా పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఈ వరుస సెలవులు మంచి అవకాశం కానున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కంటిన్యూస్‌గా 13 రోజుల విరామం ఉండటంతో జర్నీ ప్లాన్స్, రిజర్వేషన్లు ముందుగానే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Telugu News
School Holiday