• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Harish Rao: బియ్యం, పప్పు, నూనె ధరలు పెరుగుతుంటే రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు?

Harish Rao: బియ్యం, పప్పు, నూనె ధరలు పెరుగుతుంటే రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు?

Harish Rao Fire On Revanth Reddy About Price Hike: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ఏం చేయలేని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. సామాన్యుడిపై పెను భారం పడుతుంటే మొద్దు నిద్రలో ఉన్నాడని మండిపడ్డారు. వెంటనే ధరలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 05, 2026, 06:53 PM IST|Updated: Oct 05, 2026, 07:06 PM IST
joinshare
Harish Rao: బియ్యం, పప్పు, నూనె ధరలు పెరుగుతుంటే రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు?
Image Credit: Source: Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్.. ట్రైలర్‌లో వచ్చిన చివరి సెకండ్స్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం!

Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్.. ట్రైలర్‌లో వచ్చిన చివరి సెకండ్స్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం!

2

Harish Rao: బియ్యం, పప్పు, నూనె ధరలు పెరుగుతుంటే రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు?

3

Operation Trishul: తిరుపతిలో ఆపరేషన్ త్రిశూల్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!

4

Dussehra School Holidays: ఏపీ, తెలంగాణలో స్కూళ్లకు ఏకంగా 13 రోజులు దసరా సెలవులు..దేశంలో ఎక్కడా ఇన్ని సెలవులు లేవు!

5

Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Essential Commodities Price Hike: బియ్యం, పప్పు, నూనె ధరలు పెరిగిపోతుంటే ఏం చేస్తున్నావు? అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు నిలదీశారు. ఆకాశాన్నంటుతున్న సన్న బియ్యం ధరలు.. రేవంత్ సర్కార్ నేల చూపులు అని విమర్శించారు. నిత్యావసర ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని.. సామాన్యుడిపై పెను భారం పడుతుంటే మొద్దు నిద్రలో పౌరసరఫరాల శాఖ ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ హరీశ్‌ రావు విమర్శించారు. వెంటనే ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిత్యావసరాల ధరల పెరుగులతో సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఏర్పడడంతో ఈ విషయంపై 'ఎక్స్‌' వేదికగా సోమవారం మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి చేతకానితనం.. ప్రజా సమస్యలు పట్టింపు లేకపోవడాన్ని తప్పుబట్టారు. నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉండటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? రేవంత్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సిందిపోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి? అని నిలదీశారు. మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలం అయితే, ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయి? అని అడిగారు. మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటి? అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

'ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు మద్దతు పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధర. కానీ మధ్య దళారులుకు దక్కుతున్నది క్వింటాకు రూ.8000 పై మాటే. రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు.. లాభపడుతున్నది మాత్రం మధ్య దళారులు. కళ్ల ముందే ఈ తతంగమంతా జరుగుతుంటే ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? బియ్యం మాత్రమే కాదు.. ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 ధరలు అడ్డగోలుగా పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలి?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు సందేహం వ్యక్తం చేశారు.

'వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా.. పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోంది? ధరల పర్యవేక్షణ గాలికి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం కాదు.. వెంటనే చర్యలు తీసుకోవాలి' అని రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు డిమాండ్‌ చేశారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణం నిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సన్నబియ్యం సహా నిత్యావసరాల ధరలకు వెంటనే అడ్డుకట్ట వేసి, సామాన్యుడిపై పడుతున్న భారం నుండి ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Harish rao
BRS
Hyderabad
Telugu News
Telangana News