SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Harish Rao: తెలంగాణ ప్రజలకు అదొక్కటే సరిపోదు రాహుల్‌ గాంధీ: హరీశ్‌ రావు

Harish Rao Slams Rahul Gandhi: తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక సూచనలు చేశారు. హామీలు ఇవ్వడం కాదని వాటన్నింటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 14, 2026, 05:13 PM IST | Updated: Nov 14, 2026, 05:28 PM IST
Image Credit: Harish Rao vs Rahul Gandhi
Join

Harish Rao vs Rahul Gandhi: తెలంగాణ ప్రజలకు గాంధీల పేర్లతో పథకాలు పెడితే సరిపోదని రాహుల్‌ గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌ రావు చురకలు అంటించారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు హామీల అమలు అని కాంగ్రెస్‌ పార్టీకి సూచించారు. హామీలను నెరవేర్చినప్పుడే నిజమైన గౌరవం అని ప్రకటించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై నిజంగా గౌరవం ఉంటే వారి పేర్లతో ప్రారంభించిన పథకాలను.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని రాహుల్‌ గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌ రావు హితవు పలికారు.

రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ పర్యటన వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ శాసన సభాపక్షం ఉప నాయకుడు హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎక్స్‌' వేదికగా స్పందించిన హరీశ్‌ రావు.. 'ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు పెడితే సరిపోదు.. ఆ హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవం అని స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ ప్రభుత్వ మూడు బడ్జెట్ల వైఫల్యాలపై సమీక్ష చేసి లెక్క అడగాలని సూచించారు. 'హామీలు ప్రకటించడం.. పాత హామీలనే మళ్లీ తిరగబోయడం.. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం..ఇదే రేవంత్ సర్కార్ మూడు బడ్జెట్ల ఫార్ములా' అని విమర్శించారు.

'మూడు బడ్జెట్లు గడిచినా భూమిలేని వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ రూ.12 వేల సహాయం అందలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత కోసం తెచ్చిన రూ. 6,000 కోట్ల ‘రాజీవ్ యువ వికాసం’ కాగితాలకే పరిమితం. నిరుద్యోగులకు దక్కింది శూన్యం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు, హామీల అమలు అని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు గారు ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు పెట్టి, మూడు బడ్జెట్లు గడిచినా నిరుపేద కూలీలు, నిరుద్యోగ యువతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందో ఎండగడుతూ రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు పెట్టి ప్రజలను మోసం చేయడం అంటే వారిని అవమానించడమే అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు. 'రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును, వారు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లను సమీక్షించడానికి ఇదే సరైన సమయం. ఇవి కేవలం బడ్జెట్ ప్రకటనలు మాత్రమే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు. మరి ఇప్పటికీ అవి ఎందుకు అమలు కాలేదో రేవంత్‌ రెడ్డిని అడిగి తెలుసుకోండి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు సూచించారు.

'మూడు బడ్జెట్ల ఫార్ములా చాలా సింపుల్. రేవంత్‌ రెడ్డి హామీలు ప్రకటించడం.. పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి, పాత బడ్జెట్ ప్రకటనలనే మళ్లీ మళ్లీ ప్రచారం చేసుకుంటున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆరోపించార. దీంతో నిరుపేద కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయంపై గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇప్పటికీ వారికి సహాయం అందలేదు. కాంగ్రెస్ భాషలో హామీల అమలు అంటే ఇదేనా?' అని రాహుల్‌ గాంధీని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు ‘రాజీవ్ యువ వికాసం’పై బడ్జెట్ కాగితాల మీద వేల కోట్ల అంకెలు కనిపిస్తున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో నిధుల విడుదలేది? అమలు ఎక్కడ?' అని నిలదీశారు.

'కాంగ్రెస్‌ ప్రభుత్వ మూడు బడ్జెట్లు మారినా అవే పాత హామీలు, అవే కాగితపు ప్రకటనలు తప్ప ప్రభుత్వానికి ఇసుమంతైనా జవాబుదారీతనం లేదు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంత మేనిఫెస్టో హామీలను ఇంత దారుణంగా తుంగలో తొక్కడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? అని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. ఇకనైనా రాజకీయ నినాదాలు, ఉపన్యాసాలు పక్కన పెట్టి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది జిమ్మిక్కులు కాదు.. సుపరిపాలన అని స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES