• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

T Jeevan Reddy Fire On Revanth Reddy: 'పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా కాంగ్రెస్‌ కరువు తెచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి టి జీవన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శనిలా దాపురించారు' అని మండిపడ్డారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 27, 2026, 07:09 PM IST|Updated: Sep 27, 2026, 08:02 PM IST
joinshare
Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి
Image Credit: T Jeevan Reddy Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kaleshwaram Water: 'అన్ని అవకాశాలు ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మొత్తం తెలంగాణ ప్రాంతానికి శనిలా దాపరించారు. మీరు చెప్తున్న తుమ్మిడిహట్టి నుంచి నీళ్లను తరలిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు గడిచాయి.. మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇప్పటివరకు ఆలు లేదు సూలు లేదు' అని మాజీ మంత్రి టి జీవన్‌ రెడ్డి తెలిపారు. 'మూడేళ్లు గడిచింది... ఇంకో నాలుగొద్దులు అయితే మీరు దిగిపోయే సమయం వచ్చింది. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోండి' అని రేవంత్ రెడ్డికి సూచించారు.

'నీళ్లు లేకుంటే కరువు అనుకుంటాం. కానీ నీళ్లు పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్ ఈ కరువు తెచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు. లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్న చలనం లేదు' అని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి విమర్శించారు. 'మేడిగడ్డ మరమ్మతులకు సమయం పడుతుంది. కానీ అన్నారం, సుందిళ్ల నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు. తక్షణమే నీళ్లను ఎత్తిపోయాలి' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మూడేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న మరమ్మత్తులు కూడా చేయలేకపోయింది . ఎల్‌నినో ప్రభావంతో సాగు, తాగునీరు, విద్యుత్ కొరతతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . అవకాశం లేక కాదు అవకాశం ఉండి కూడా  మనం ఉపయోగించుకోవడం లేదు' అని తెలిపారు.

నదీ జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రాణహిత నది జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసేందుకు కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ప్రాణహిత నదీ జలాలను ఎత్తి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయవచ్చని తెలిపారు. ఎల్లంపల్లి కూడా 20 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. ఎల్లంపల్లి నుంచి దిగువకు విడుదల చేయడం ద్వారా పైకి ఎత్తిపోసుకోవచ్చు' అని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి వివరించారు.

'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో గ్రావిటీ కెనాల్స్ కట్టారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి ఎత్తిపోసేలా పంపింగ్ వ్యవస్థను రూపొందించారు. ఎస్సారెస్పీలో 46 టీఎంసీలు నీళ్లు ఉన్నా కూడా ఖరీఫ్ పంటకు నీళ్లు వినియోగించుకోలేకపోతున్నాం. రెండో పంటకు నీళ్లు ఇవ్వాలంటే దిగువ నుంచి నీళ్లు ఎత్తిపోసుకుని ఎస్ఆర్ఎస్పీ నిల్వ సామర్థ్యాన్ని నింపితే కానీ సాధ్యం కాదు' అని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

'తెలంగాణ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లౌక్యం ప్రదర్శించి ఉత్తర దక్షిణ తెలంగాణలో సస్యశ్యామలం చేయాలంటే ప్రాణహిత నది జలాలను ఉపయోగించుకున్న నాడే సాధ్యమవుతుందని భావించారు. మహారాష్ట్ర 148 టీఎంసీలకు పట్టుబట్టడంతో మేడిగడ్డ వద్ద ఇంకో 100 మీటర్లు ఎత్తుతోని ఒప్పందం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా కాళేశ్వరాన్ని నిర్మించారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు.

'ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవండి. ఈ నెల 30వ తేదీన  సిరిసిల్ల పోతానంటున్నావు. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల కూడా కాళేశ్వరంలో భాగమే. ఎస్సార్‌ఎస్పీ ద్వారా సాగునీరు ఇవ్వు ముందు. కన్నెపల్లి నుంచి నీటిని ఎగువకు ఎత్తిపోసి శ్రీరాంసాగర్ తరలిస్తే రబీకి సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సన్నాయి నొక్కుడు నొక్కుడు కాదు' అని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
BRS
Hyderabad
Telugu News
Telangana News