SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టీచర్లకు బిగ్ షాక్..FRS హాజరు వేయకపోతే జీతం కట్.. ఒక్కరోజే 68 మందికి నోటీసులు..!!

FRS Attendance: సమయపాలన పాటించకుండా.. ఆఫ్ లైన్ రిజిస్టర్లలో సంతకాలతో సరిపెట్టే టీచర్లకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బడికి ఆలస్యంగా రావడం.. డిజిటల్ హాజరుకు దూరంగా ఉండటం వంటి నిర్లక్ష్య వైఖరిపై అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 09, 2026, 11:13 AM IST | Updated: Oct 09, 2026, 11:17 AM IST
Image Credit: FRS Attendance
Join

FRS Attendance: సమయపాలన పాటించకుండా.. ఆఫ్ లైన్ రిజిస్టర్లలో సంతకాలతో సరిపెట్టే టీచర్లకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బడికి ఆలస్యంగా రావడం.. డిజిటల్ హాజరుకు దూరంగా ఉండటం వంటి నిర్లక్ష్య వైఖరిపై అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 

పాఠశాలల్లో పారదర్శకత.. క్రమశిక్షణ పెంచేందుకు ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్ లో గత నెల రోజులుగా హాజరు నమోదు చేయని 68 మంది టీచర్లకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా సరైన వివరణ ఇవ్వనట్లయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటెండెన్స్ పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న టీచర్ల వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రంగారెడ్డి  జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విద్యాశాఖలో సమయపాలన పకడ్బందీగా అమలు చేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదైన హాజరును ప్రామాణికంగా తీసుకుని మాత్రమే టీచర్ల జీతాలు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ డీటీజీఓకి స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. కలెక్టర్ ఉత్తర్వులతో సాంకేతిక కారణాల నెపంతో లేదంటే అలసత్వంతోనే ఎఫ్ఆర్ఎస్ హాజరు వేయని ఉపాధ్యాయుల జీతాలు ఈ నెల నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని చెప్పాలి.

కాగా  గత నెల రోజులుగా అసలు FRS యాప్ లో హాజరు ఎందుకు నమోదు చేయ లేదు? అందులోని లోపమేంటి లేదా ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమా? అన్న వివరాలపై ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని DEO ఆదేశించారు. ఉపాధ్యాయులు ఇచ్చే సమాధానాలను పరిశీలించిన తర్వాత, నిబంధనల ప్రకారం శాఖాపరమైన తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సాంకే తిక సమస్యల పేరు చెప్పి విధులకు గైర్హాజరయ్యే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.

బోధన, ఫలితాలపై నిరంతర నిఘా ఉంటుందని ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీఈఓ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయానికి పాఠశాలకు వచ్చి విధిగా  FRSలో హాజరు నమోదు చేయాలన్నారు. కేవలం టీచర్ల హాజరు మాత్రమే కాకుండా తరగతి గది బోధన, విద్యార్థుల చదువు ప్రమాణాలు (అ భ్యసన స్థాయిలు) ఎలా ఉన్నాయో నిరంతరం తనిఖీ చేస్తాం. పాఠశాలల్లో క్రమ శిక్షణ, బోధనా నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని తేల్చిచెప్పారు.విద్యాశాఖ తీసుకున్న ఈ సంచలన చర్యతో రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలల్లో కలకలం మొదలవ్వగా, ఉపాధ్యాయులు ఇకపై ఎఫ్ఆర్ఎస్ నమోదులో అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES