• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లలో ఇకపై రెగ్యులర్ బస్సులు..

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లలో ఇకపై రెగ్యులర్ బస్సులు..

Good News for Telangana RTC Passengers: దసరా పండుగను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం బస్సులను విజయవంతంగా నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 17, 2026, 11:11 AM IST|Updated: Oct 17, 2026, 04:16 PM IST
joinshare
ప్రయాణికులకు గుడ్ న్యూస్..  ఆ రూట్లలో ఇకపై రెగ్యులర్ బస్సులు..
Image Credit: Telangana RTC (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన  అమ్మాయిలు.. వీడియో ..

Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన అమ్మాయిలు.. వీడియో ..

2

Rain Alert: తెలంగాణ, ఏపీకి చల్లటి కబురు.. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన

3

Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం.. భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

4

Vangaveeti Radha: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా అతడే!

5

Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


RTC Passengers: హైదరాబాద్ మహా నగరం నుంచి దసరా సెలవుల కోసం సొంతూళ్లకు ఒక్కొక్కరుగా బయలుదేరుతున్నారు. ఈ నెల  17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను నడపనున్నారు. దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు.

బతుకమ్మ, దసరా పండగల రద్దీని ఆర్టీసీ ప్రత్యేక ఆదాయ అవకాశంగా మలుచుకుంటోంది. హైదరాబాద్‌ నగరంలో తక్కువ దూరాల్లో తిరిగే సిటీ బస్సులను సైతం సుదూర ప్రాంతాలకు మళ్లించి ప్రత్యేక సర్వీసులుగా నడుపుతోంది. రెగ్యులర్‌ సర్వీసులను స్పెషల్‌ సర్వీసులుగా మార్చి సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో ప్రయాణికులపై భారం పడుతోంది. మరోవైపు పండగ రద్దీతో సాధారణ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులకూ భారీ గిరాకీ ఉంది.

హైదరాబాద్‌ నుంచి వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సత్తుపల్లి, మహబూబ్‌నగర్, నారాయణఖేడ్, ఆదిలాబాద్‌కు ప్రయాణికులు భారీగా తరలి వెళ్తున్నారు. పండుగ ముగిసిన అనంతరం తిరిగి నగరాలకు చేరుకునే ప్రయాణికుల కోసం కూడా ఇదే తరహాలో ప్రత్యేక బస్సు సర్వీసులను సిద్ధం చేయాలని ఆదేశించారు.

బస్ స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రయాణికులు తమ ముందస్తు రిజర్వేషన్లను అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులందరూ ఆర్టీసీ సేవలనే వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Hyderabad