• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

ZEE Telugu News Educational Conclave: సమాజ నిర్మాణానికి ప్రాణవాయువైన గురువులను సత్కరిస్తూ.. విద్యా వ్యవస్థ సమగ్ర వికాసంపై సమగ్ర చర్చను వేదికగా మలుస్తూ జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 13న ప్రతిష్టాత్మక "ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం" కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 01:28 PM IST|Updated: Oct 12, 2026, 01:37 PM IST
joinshare
'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..
Image Credit: ZEE Telugu News Education Conclave (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

2

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

3

KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

4

'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

5

AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Guru Vandanam Teachers Awards 2026: అన్ని దానాల్లో కన్నా విద్యాదానాన్ని మించింది లేదు.   "జీవితాన్ని మార్చే విద్యాదానం కంటే మించిన దానం లేదనేది పెద్దలు చెప్పే మాట. కళ్లు తెరిపించి గెలుపు బాట చూపించే గురువును మించిన దైవం ఎక్కడా లేడు" అనే మహోన్నత ఆశయంతో.. తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అక్షర యోధులను ఈ వేదికపై ఘనంగా సత్కరించనున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిథులు..

ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, టీచర్స్ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, విశ్రాంత ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.

మల్లు భట్టి విక్రమార్క – గౌరవ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి,  ఆర్థిక & విద్యుత్ శాఖల మంత్రి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – గౌరవ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి

జూపల్లి కృష్ణారావు – గౌరవ తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి

కె.కేశవరావు (కేకే) – తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, విద్యా పాలసీ అమలు కమిటీ చైర్మన్

ఈటల రాజేందర్ – మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు

డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ – లోక్‌సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్

వి.వి.లక్ష్మీనారాయణ (జేడీ) – మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్

పి.శ్రీపాల్ రెడ్డి – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

విద్యా వ్యవస్థపై మూడు కీలక ప్యానెల్ చర్చలు:

అవార్డుల ప్రదానోత్సవంతో పాటు, తెలంగాణ విద్యా రంగంలో క్షేత్రస్థాయి సవాళ్లు, పరిష్కారాలపై విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులతో మూడు ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి.

1. ఉన్నత విద్య: ఉద్యోగాల కల్పన – సవాళ్లు..

చర్చనీయాంశం: డిగ్రీలు వస్తున్నా ఉద్యోగాలు ఎందుకు దక్కడం లేదు..? సాంకేతిక నైపుణ్యాల కొరతను అధిగమించి ఉన్నత విద్యా ప్రమాణాలను ఎలా పెంచాలి..?

వక్తలు:

శ్రీమతి ఎ.శ్రీదేవసేన (కమిషనర్, సాంకేతిక & కళాశాల విద్య)

ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి)

ప్రొఫెసర్ కుమార్ మొలుగురం (వైస్ ఛాన్సలర్, ఉస్మానియా యూనివర్సిటీ)

ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి (వైస్ ఛాన్సలర్, జేఎన్టీయూ హైదరాబాద్)

డాక్టర్ సీహెచ్.ప్రీతి రెడ్డి (వైస్ ఛైర్మన్, మల్లా రెడ్డి విశ్వవిద్యాపీఠ్)

2.ఇంటర్మీడియట్ విద్య: సంస్కరణలు – విలీన ప్రతిపాదనలు...

చర్చనీయాంశం: ర్యాంకుల ఒత్తిడిలో నలుగుతున్న ఇంటర్ విద్య.. విద్యా కమిషన్ ప్రతిపాదించిన ప్రాథమిక విద్యలో ఇంటర్ విలీనం ఎంతవరకు సమంజసం..? దీనివల్ల విద్యార్థులకు లాభమా, నష్టమా..?

వక్తలు:

శ్రీమతి అభిలాష అభినవ్ (డైరెక్టర్, ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్య)

వి.నరేందర్ రెడ్డి (అధినేత, అల్ఫోర్స్ విద్యా సంస్థలు)

పి.మధుసూదన్ రెడ్డి (ఛైర్మన్, ఇంటర్ JAC)

వజ్జల సునీల్ (ప్రిన్సిపాల్, కేశవ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ & ప్రముఖ విద్యావేత్త)


3.ప్రాథమిక విద్య (Primary Education): సమగ్ర పాఠశాలలు – భవిష్యత్ కార్యాచరణ..

చర్చనీయాంశం: సమాజ పురోగతికి పునాది అయిన ప్రాథమిక విద్య ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి..? మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా విద్యార్థుల ప్రమాణాలను ఎలా మెరుగుపరచాలి..?

వక్తలు:

నవీన్ నికోలస్ (తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్)

పి.శ్రీపాల్ రెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ)

దామోదర్ రెడ్డి (రాష్ట్ర అధ్యక్షులు, PRTU)

కె.మహిపాల్ రెడ్డి (రాష్ట్ర అధ్యక్షులు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్)

సమయం & వేదిక: ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ చర్చా కార్యక్రమం జరగనుంది.

తేదీ: అక్టోబర్ 13

వేదిక: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC), రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్, హైదరాబాద్

నిర్వాహకులు: జీ తెలుగు న్యూస్
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Hyderabad