• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

AP Rythu Bazar Rice Price News: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు అమాంతం పెరగడంతో, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు. రైతుబజార్లలో కేఎన్ఎం (KNM) రకం బియ్యాన్ని కిలో రూ.50కి, బీపీటీ (BPT) రకాన్ని రూ.49కే అందజేస్తున్నారు.

Written ByHarish Darla
Published: Oct 12, 2026, 01:19 PM IST|Updated: Oct 12, 2026, 01:24 PM IST
joinshare
AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

2

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

3

KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

4

'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

5

AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Rythu Bazar Rice Price News: దేశంలో ఎల్ నినో ప్రభావం కారణంగా నిత్యావసర సరుకుల ధరలతో పాటు బియ్యం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సాధారణ పేద, మధ్యతరగతి ప్రజలు రోజువారీ వినియోగానికి సన్నబియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం కిలో రూ.60 నుంచి రూ.65 వరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారికి ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

రైతుబజార్లలో పంపిణీ ప్రారంభం..
పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన సన్నబియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఇందులో కేఎన్ఎం రకం సన్నబియ్యాన్ని కిలో రూ.50కి, బీపీటీ రకం బియ్యాన్ని రూ.49కి అందిస్తున్నారు. 

విజయవాడలోని భవానీపురం రైతుబజార్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం 10:30 గంటలకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకే ఈ బియ్యాన్ని అందజేస్తున్నారు.

నిబంధనలు, పారదర్శకత..
వినియోగదారులు తమ సమీపంలోని రైతుబజార్‌లకు వెళ్లి ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు చూపించి నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రతినెల ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 26 కిలోల బియ్యం ప్యాకెట్ కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. 

ఈ విక్రయాలు పారదర్శకంగా జరుగుతుండడంతో మొదటి రోజే ప్రజల నుంచి విశేష స్పందన లభించి, క్యూలైన్లలో నిలబడి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎలాంటి అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా అధికారులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు.

ప్రజలకు లభించే ప్రయోజనం..
ఓపెన్ మార్కెట్‌తో పోలిస్తే ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించడం వల్ల సామాన్య కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల బహిరంగ మార్కెట్‌లో కూడా ధరలు అదుపులోకి వచ్చి స్థిరపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Telugu News