• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Harish Rao: 'సిద్దిపేట' వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

Harish Rao: 'సిద్దిపేట' వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

Harish Rao Demands To Revanth Reddy Apology: తన సొంత నియోజకవర్గం సిద్దిపేట వేదికగా రేవంత్‌ రెడ్డి చేసిన ప్రసంగానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర ముఖ్యమంత్రికి బూతులు ఎక్కువ అని మండిపడ్డారు. ఎక్స్‌ వేదికగా హరీశ్‌ రావు స్పందన ఇది..

Written By Ravi Kumar Sargam
Published: Nov 19, 2026, 22:32 IST|Updated: Nov 19, 2026, 23:01 IST
joinshare
Harish Rao: 'సిద్దిపేట' వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు
Image Credit: Harish Rao Reaction

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Revanth Reddy Apology: చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర రేవంత్‌ రెడ్డికి బూతులు ఎక్కువ అని బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. గంట పైగా సాగిన చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదని చెప్పారు. వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలే ఉన్నాయని రేవంత్‌ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరట లేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

సిద్దిపేట బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగంపై 'ఎక్స్‌' వేదికగా మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి అసభ్య, నీచపు ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సిద్దిపేటకు నిలిపేసిన రూ.1,070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు. ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర ముఖ్యమంత్రికి బూతులు ఎక్కువ. తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు' అని రేవంత్‌ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తీసిపడేశారు.

'మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. భూమిలో బలంగా వేర్లు ఉండడంతోనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది. ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు' అని రేవంత్‌ రెడ్డి తీరును మాజీ మంత్రి హరీశ్‌ రావు తప్పుబట్టారు. గౌడన్నల కల్పతరువు తాడిచెట్టును పదే పదే తూలనాడినందుకు  రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

'జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం. పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే. తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా? అని నిలదీశారు.

'మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది? వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. 'కేసీఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు. ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది' అని వెల్లడించారు.

నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడని రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి రూ.కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ అని గుర్తుచేశారు. కేసీఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమేనని స్పష్టం చేశారు. 'నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్లును, నోటి దుర్ధాన్ని కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?' అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
BRS
Harish rao
Politics
Telangana News
Telugu News