• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

Asifabad Head master news: స్కూల్ ఆవరణలో హెడ్‌మాస్టర్ తప్పతాగి రావడంను విద్యార్థులు గమనించారు. దీనిపై వివాదం తలెత్తడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అసిఫాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 03, 2026, 05:43 PM IST|Updated: Nov 03, 2026, 06:10 PM IST
joinshare
Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..
Image Credit: asifabad drunk head master video row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pawan Kalyan: వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు రద్దు.. మురసు తుపాన్ పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

Pawan Kalyan: వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు రద్దు.. మురసు తుపాన్ పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

2

Tirupati Corporation: తిరుపతిలో 'అధికార కూటమి' క్లీన్‌స్వీప్‌.. 2 స్థానాలకే వైఎస్సార్‌సీపీ పరిమితం

3

Pulivendula: జగన్ కంచుకోటలో టీడీపీ ప్రభంజనం.. చొక్కా మడతెట్టి ఖంగుతిన్న వైసీపీ అధినేత..

4

Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

5

Chandrababu: మున్సిపల్‌ ఫలితాల్లో 'కూటమి క్లీన్‌స్వీప్‌'.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Head master consuming alcohol in asifabad: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూళ్లలో వేస్తుంటారు. విద్యార్థులకు మంచి చదువు అందించడానికి తెగ ఆరాట పడతారు. దీని కోసం ఎలాంటి త్యాగాలకైన వెనుకాడరు. మంచి స్కూళ్లలో వేస్తే వారి జీవితం బాగుంటుందని భావిస్తారు. అయితే కొంత మంది టీచర్లు పాఠశాలల్లో మంచి చదువులు బోధిస్తు పిల్లల్ని అన్ని రంగాల్లో ముందుకు తెవడానికి ఆరాటపడుతుంటారు. పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా బోధిస్తారు. కానీ మరికొంత మంది మాత్రం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి  వారు చేస్తున్న పనులతో వివాదాస్పదంగా  మారుతున్నారు. కొంత మంది తప్పతాగి స్కూళ్లకు రావడం వంటివి చేస్తున్నారు. 

 

మద్యం మత్తులో పాఠశాలకు హెడ్‌మాస్టర్... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్తులు ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్ పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీనివాస్ మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని విద్యార్థులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు హెడ్‌మాస్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. #Asifabad #Headmaster #SchoolIncident #TelanganaNews

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 3, 2026

 

మరికొంత మంది బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నారు. అంతే కాకుండా పవిత్రమైన పాఠశాలలో తోటి టీచర్లను సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఆసిఫాబాద్  జిల్లా తిర్యాణి మండలంలో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం వార్తలలో నిలిచింది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావు పేటలో స్కూల్ లో హెడ్‌మాస్టర్‌ తప్పతాగి వచ్చాడు. అంతే కాకుండా స్కూల్లోనే వైన్ బాటిల్ ను తెచ్చుకుని సీక్రెట్గా తాగుతూ హల్ చల్ చేశారు. 

ఈ క్రమంలో హెడ్‌మాస్టర్‌ నిర్వాకంను కొంత మంది విద్యార్థులు గమనించారు. వెంటనే  గ్రామస్తులకు చెప్పారు.  దీంతో గ్రామస్తులు మాటు వేసి హెడ్‌మాస్టర్‌ ను సీక్రెట్ గా మద్యం తాగుతున్నప్పుడు పట్టుకున్నారు. ఆ తర్వాత గట్టిగా ప్రశ్నిస్తే మద్యం మత్తులో తులుతూ పొంతనలేని సమాధానం చెప్పాడు. ఇక లాభంలేదని గ్రామస్తులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై స్థానికంగా వివాదం రాజుకుంది.  ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై చర్యలు తీసుకొవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Trending News