• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /రైతు భరోసాపై బిగ్ అప్‌డేట్.. ఆ రోజు ఖాతాల్లోకి డబ్బులు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

రైతు భరోసాపై బిగ్ అప్‌డేట్.. ఆ రోజు ఖాతాల్లోకి డబ్బులు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ రైతులకు శుభవార్త! ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు డిసెంబర్ 7న జమ అయ్యే అవకాశం ఉంది. రైతు బంధు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో మీ ఖాతాలో డబ్బులు జమయ్యాయో లేదో ఆన్లైన్లో స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 17, 2026, 08:41 IST|Updated: Nov 17, 2026, 08:55 IST
joinshare
రైతు భరోసాపై బిగ్ అప్‌డేట్.. ఆ రోజు ఖాతాల్లోకి డబ్బులు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
Image Credit: How to Check Cheyutha Pension Status:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to Check Cheyutha Pension Status: తెలంగాణ రైతులకు భారీ శుభవార్త! డిసెంబర్ 7న రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం కృషి చేస్తోంది. డిసెంబర్ 7కు రేవంత్ సర్కార్ ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధుల విడుదలకు ఇదే రోజును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రోజున అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. మొదటగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్నవారికి ఈ నిధులు విడుదల చేయనుంది. నవంబర్ 19న ఈ వివరాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ చాలా మంది అర్హులైన రైతులతో పాటు దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృత్తులపై ఆధారపడిన వారికి కూడా అందుతోంది. వారికి ఆర్థికంగా భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ పెన్షన్ ఆధారంగా పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనంగా ఉంది. హైదరాబాద్‌లో 35 వేల మందికి పైగా కొత్త పెన్షన్లకు కూడా అర్హత లభించింది.

రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. వ్యక్తిగత ఖాతాల్లో పెన్షన్ నగదు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా ఆర్థిక ఆధారం లేని వృద్ధులకు ఈ సాయం అందిస్తోంది. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరినీ అర్హులుగా గుర్తిస్తోంది. గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ముఖ్యంగా ఆర్థిక భరోసా లేని వృద్ధులను ఎంపిక చేస్తోంది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు అందరినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో లబ్ధిదారుల సంఖ్య కాస్త తక్కువగా ఉంది.

చేయూత ద్వారా పెన్షన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత పథకం కింద మొత్తం 4,63,857 మంది పెన్షన్లకు మంజూరు లభించింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమకు మంజూరైందో లేదో cheyutha.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడి తదితర వివరాలతో మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ స్టేటస్ "విత్ హెల్డ్" అని వస్తే, పంచాయతీ సెక్రటరీ లేదా సంబంధిత అధికారులను కలిసి అవసరమైన పత్రాలను అందజేయాలి.

Read Also: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త.. 4.63 లక్షల మందికి కొత్త పెన్షన్లు, నవంబర్ 19న నేరుగా ఖాతాల్లోకి నగదు!
 

నవంబర్ 19న పెన్షన్ ఆమోదం జరిగిన తర్వాత స్టేటస్ మారే అవకాశం ఉంది. "డిస్బర్స్డ్" అని ఉంటే పెన్షన్ పంపిణీకి అప్రూవ్‌ అయినట్లు, "విత్ హెల్డ్" అని ఉంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ సరిగ్గా లింక్ కాకపోవడం లేదా NPCI మ్యాపింగ్ యాక్టివ్‌గా లేకపోవడం కారణం కావచ్చు. లబ్ధిదారుల ధ్రువీకరణ, అంటే కేవైసీ పూర్తికాకపోయినా ఇలా చూపిస్తుంది. ఒకవేళ 19వ తేదీ తర్వాత కూడా సమస్య కొనసాగితే, పంచాయతీ సెక్రటరీని కలిసి మీ వివరాలను తెలుసుకోవచ్చు. లాగిన్ పెన్షన్ ఐడీని ఎంటర్ చేస్తే కారణాలు కూడా తెలిసిపోతాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Telangana News
Revanth Reddy
Telugu News