• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Mla Paidi Rakesh Reddy: నాకు చాన్స్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా.!. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన..

Mla Paidi Rakesh Reddy: నాకు చాన్స్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా.!. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన..

Paidi rakesh reddy in Telangana assembly session: తన అసెంబ్లీ నియోజక వర్గమైన నిజామాబాద్ ను ప్రభుత్వం చాలా చిన్న చూపుచూస్తుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. అంతే కాకుండా రాజీనామా చేయడానికి సైతం వెనక్కు తగ్గేది లేదని తెల్చి చెప్పారు.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 16, 2026, 12:20 PM IST|Updated: Sep 16, 2026, 12:34 PM IST
joinshare
Mla Paidi Rakesh Reddy: నాకు చాన్స్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా.!. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన..
Image Credit: mlarakeshreddyinassemblysession

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bjp mla Paidi rakesh reddy sensational speech Telangana assembly session: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్  రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్,   బీజేపీ పార్టీలకు చెందిన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ తమ మహిళ ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని రచ్చచేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ ను పట్టుకుని ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇద్దరు ఎమ్మెల్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో  దీనిపై  బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య వివాదం రాజుకుంది. 

 

నన్ను మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తాను

– బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి pic.twitter.com/zZZXp7HPFM

— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026

 

దీంతో అసెంబ్లీలో పొడియం వద్ద నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు. మరోవైపు బీజేపీ కూడా 22ఏ వివాదం, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపాధ్యాయుల బెనిఫిట్స్ మొదలైన అంశాలపై ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా విమర్శలు చేస్తుంది. 

ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిజామాబాదు జిల్లా అంటే ప్రభుత్వానికి చిన్న చూపులా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే చర్యల వల్ల అవసరం అయితే రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. తనకు మాట్లాడేందుకు ఒక పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని లేకుంటే.. తాను రాజీనామా  చేస్తానని ప్రకటించారు. 

అంతే కాకుండా.. కొడంగల్ తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారు .. మరీ మా జిల్లాకు ఎన్ని నిధులు ఇచ్చారో బైటపెడతానంటూ మండిపడ్డారు.  అసెంబ్లీ వేదికగా అన్ని లెక్కలు చెప్పి అసరమైతే రాజీనామా చేస్తానని ఫైర్ అయ్యారు.

Read more: ప్రధానిగా 12 యేళ్లు.. ప్రభుత్వాధినేతగా@25ఇయర్స్.. మోడీ ఖాతాలో రేర్ రికార్డులు..

 తనకు పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్  గడ్డం ప్రసాద్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఈ  క్రమంలో పైడి రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Assembly
Telugu News
Revanth Reddy