SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Yadadri: చౌటుప్పల్ లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు దోపిడి..

Jogini killed in yadadri: జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్ దారుణ హత్య చౌటుప్పల్ లో సంచలనంగా మారింది. ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారంతో పాటు,రూ.10 లక్షల నగదును దుండగలు దోచుకెళ్లారు.

Written By Inamdar Paresh
Published: Nov 01, 2026, 09:03 AM IST | Updated: Nov 01, 2026, 09:15 AM IST
Image Credit: joginimurderyadadrinews
Join

Jogini brutally killed in choutuppal yadadri bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని  చౌటుప్పల్ లో షాకింగ్ ఘటన వెలుగు లోకి వచ్చింది. నిన్న అర్ధరాత్రి (శనివారం)
జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్ దారుణ హత్య తీవ్ర కలకలంగా మారింది. గుర్తుతెలియని దుండగులు జోగిని సుధాకర్ ను అత్యంత క్రూరంగా హత్య చేసి ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు  తీసుకుని పారిపోయారు. 

ఉదయం పూట రక్తపు మడుగులో ఉన్న జోగినిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్ తో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో చౌటుప్పల్ లో తీవ్ర విషాదం నెలకొంది. 

మరోవైపు జోగినితో ఎవరితో అయిన వివాదాలు ఉన్నాయా..?.. లేదా తెలిసిన వారే ఈ  ఘాతుకుం చేసి ఉంటారా..?.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన ప్రదేశంకు చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీలే ఈ ఘటనలో కీలకంగా మారాయి. మరోవైపు జాగిలాలు, క్లూస్ టీమ్ తో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES