• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Kavitha Strike: ఆమరణ దీక్ష చేస్తానని కవిత ప్రకటన.. ఏ డిమాండ్‌పై అంటే?

Kavitha Strike: ఆమరణ దీక్ష చేస్తానని కవిత ప్రకటన.. ఏ డిమాండ్‌పై అంటే?

Kavitha Announces Hunger Strike For Singareni Workers: రాజకీయ పార్టీ పెట్టిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ కవిత సింగరేణిపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కోసం తాను ఆమరణ దీక్ష చేస్తానని సంచలన ప్రకటన చేశారు. సింగరేణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 05, 2026, 03:34 PM IST|Updated: Oct 05, 2026, 03:46 PM IST
joinshare
Kavitha Strike: ఆమరణ దీక్ష చేస్తానని కవిత ప్రకటన.. ఏ డిమాండ్‌పై అంటే?
Image Credit: Source: Telangana Rakshana Sena Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కాంతి వెలుగుల్లో మెదడు మర్మం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్..!!

కాంతి వెలుగుల్లో మెదడు మర్మం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్..!!

2

Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్

3

బరువు తగ్గాలనుకుంటున్నారా?.. సాయంత్రం ఆకలేస్తే తినే 10 'జీరో గిల్ట్' హెల్తీ స్నాక్స్ ఇవే!

4

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి, నటిపై అసభ్యకర పోస్ట్ లు.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.!.

5

తెలంగాణ సచివాలయానికి వాటర్‌ షాక్‌.. బిల్లుకు పేరుకు పేవడంతో నీళ్లు కట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kavitha Hunger Strike: 'సింగరేణి సమస్యలపై రెండు నెలల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో పెద్ద స్థాయిలో పోరాటం ప్రారంభించాం. మెడికల్ బోర్డు, సింగరేణికి పర్సంటేజ్ పెంచడం విషయంలో అలసత్వం వహించవద్దు' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ, మాజీ ఎమ్మెల్సీ కవిత సూచించారు. 'అధికారులు రెండు నెలలు సమయం కోరారు.  వద్రెండు నెలల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా' అని సంచలన ప్రకటన చేశారు.

'సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా  చెల్లించాలి. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరిని అన్‌ఫిట్ చేయాలి. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలి. మారుపేర్లు (అలియాస్ నేమ్స్) కార్మికుల సమస్య పరిష్కరించాలి' అని మాజీ ఎంపీ కవిత డిమాండ్‌ చేశారు. 'జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలి. విజిలెన్స్ పేరుతో ఆపిన డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కోసం 2 గుంటల భూమి ఇవ్వాలి. సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలి. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు జీతాలు ఇవ్వాలి. సింగరేణికి బాకీ పడిన రూ.62 వేల కోట్లు వెంటనే చెల్లించాలి' అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో కార్మికులు, వర్కర్ల డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్యర్వంలో భారీ ప్రదర్శన జరింది. సింగరేణి భవన్‌ను ముట్టడించిన అనంతరం కవిత మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. సీఎండీ వచ్చి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. 'సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తప్పించుకుంటోంది' అని ఆరోపించారు.

'డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల హక్కు. అది మీరు వేసే బిచ్చం కాదు. కచ్చితంగా నెలకు రెండు రోజులు మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. సింగరేణి లాభాల్లో 35 శాతం బోనస్‌ను కార్మికులకు ఇవ్వాల్సిందే. అలియాస్ పేర్లు ఉన్న కార్మికులను విజిలెన్స్ పేరుతో వేధించవద్దు. కార్మికులను వేధిస్తూ అక్రమంగా ఉద్యోగాలు తొలగించిన వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలి. సమస్యల పరిష్కారానికి సంబంధించి సీఎండీ వచ్చి మాతో చర్చలు జరపాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 'మొక్కుబడిగా మెడికల్ బోర్డు నిర్వహిస్తాం అంటే ఊరుకునేది లేదు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు పెట్టుకున్న ప్రతి సింగరేణి కార్మికుడిని అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాల్సిందే!' అని కవిత తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Hyderabad
Telangana News
Telugu News