SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kavitha: ఇంటర్‌ బోర్డు విలీనంపై కవిత ఆగ్రహం.. రేవంత్‌ రెడ్డిపై మండిపాటు

Kavitha Fire On Revanth Reddy: ఇంటర్‌ వ్యవస్థను రద్దు చేసి పాఠశాల విద్యలో కలిపేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 25, 2026, 20:07 IST | Updated: Nov 25, 2026, 20:11 IST
Image Credit: Kavitha On Inter Education Merge
Join

Nizamabad: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వ్యవస్థను రద్దు చేస్తూ పాఠశాలలో విలీనం చేయాలనే నిర్ణయంపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటర్‌ బోర్డు రద్దుపై ఏకపక్ష నిర్ణయం సరికాదని.. తల్లితండ్రులు, జూనియర్ కాలేజ్, స్కూల్ యాజమాన్యాలు, విద్యావేత్తలతో మాట్లాడాక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇంటర్ బోర్డును ఏకపక్షంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు విలీనం పై ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కవిత కోరారు.

నిజామాబాద్‌లో బుధవారం పర్యటించిన కవిత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇంటర్ విద్యను స్కూల్ విద్యలో విలీనం చేస్తామనే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో ముందు తల్లితండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు, విద్యావేత్తలతో చర్చలు జరపాలి' అని కవిత విజ్ఞప్తి చేశారు. స్కూల్ విద్యలో ఇంటర్‌ను కలుపుతారా? ఇంటర్ విద్యలో స్కూల్ విద్యను కలుపుతారా స్పష్టత ఇవ్వాలని కోరారు. 

'ల్యాబ్‌లు, మౌలిక వసతులు, భోదన సిబ్బంది గురించి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని.. ఇప్పటికైనా ఇంటర్ విద్య కోసం తల్లితండ్రులు రూ.3 లక్షల నుంచి రూ.4  లక్షలు ఖర్చు చేస్తున్నారు. 9, 10, 11, 12 తరగతుల కారణంగా తల్లితండ్రులపై మరింత ఫీజుల భారం ఉంటుంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్యను సమాంతరంగా ప్రోత్సహిస్తారా? కార్పొరేట్ ఫీజుల నియంత్రణ చేస్తారా? అనే దాని గురించి ప్రభుత్వం చెప్పడం లేదని తెలిపారు. ఏం లేకుండా ఇష్టానుసారంగా ఇంటర్ బోర్డు ను స్కూల్ విద్యలో విలీనం చేస్తామంటే తాము అంగీకరించమని కవిత స్పష్టం చేశారు.

'నిజామాబాద్ జిల్లాలో 18 మండలాలను మాత్రమే కరువు మండలాలు గుర్తించారు. కానీ ఇంకా చాలా మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయి. కానీ ఆ మండలాలకు ఏం ఇస్తారో, ఎలాంటి సాయం చేస్తారో స్పష్టత ఇవ్వటం లేదు. 18 మండలాల్లో మాత్రమే కాదు మిగతా మండలాల్లో కూడా తాగునీటి ఇబ్బంది ఉంది. ప్రభుత్వం మరొకసారి రీ సర్వే చేయాలి. కరువు మండలాల ఇంకొక జాబితాను ప్రకటించాలి' అని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని కరువు బారి నుంచి బయటపడేసేందుకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

'కరువును దృష్టిలో పెట్టుకొని రైతులకు సరైన ప్రణాళిక ఇవ్వాలి. అరుతడి పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం ఏ పంటలు వేయాలో చెప్పడం లేదు. రైతులు అరుతడి పంటలు వేస్తే ఏ ధరకు కొంటారో కూడా చెప్పడం లేదు. ఇక రైతులకు సబ్సిడీ, యూరియా విషయంలో కూడా ఏమీ స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఇష్టానుసారంగా కరెంట్ కోతలు పెడుతున్నారు. ఈ కరెంట్ కోతలను నమ్ముకొని రైతులు పంటలు వేసే పరిస్థితి లేదు' అని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ తీరుపై కవిత ధ్వజమెత్తారు.

అగ్రికల్చర్ అధికారులు, నాయకులను సమన్వయం చేసుకొని రైతులకు ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈ కరువు పరిస్థితుల్లో రైతులను ఎక్కువగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. కానీ బీజేపీ ఎంపీలు దీనిపై ఒక్కమాట మాట్లాడడం లేదని.. పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. '16వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 16వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేలా చేయాలి' అని డిమాండ్‌ చేశారు.

'కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లు పాదయాత్రలు చేస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్లు మీటింగ్‌లు పెడుతున్నారు. స్వరడబ్బా.. పరడబ్బా.. పరస్పర డబ్బా అన్నట్లు వాళ్లకు వాళ్లే పొడుగుకుంటున్నారు. కానీ ప్రజలను పట్టించుకోవడం లేదు' అని బీజేపీ, కాంగ్రెస్‌లపై కవిత విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల సమస్యలు పట్టించుకోవాలని కోరారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES