Danam Disqualified Khairatabad By poll: రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పునే తాను చేసాడు. అప్పట్లో కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి తన పార్టీలో కాంగ్రెస్, తెలుగు దేశం సభ్యులను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. నువ్వు నేర్పని విద్యే నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ చేసిన పనినే తాను అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపాడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరుపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు.
దానం పై అనర్హత వేటు..
అయితే వారిపై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ స్పీకర్ వారి పై ఎలాంటి అనర్హత వేటు వేయలేదు. వారి పార్టీ ఫిరాయించలేదని చెప్పారు. మరోవైపు పార్టీ మారిన 10 మందిలో దానం నాగేందర్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫారం తరుపున ఎంపీగా పోటీ చేయడం బీజేపీ, బీఆర్ఎస్‌కు ఆయుధంగా దొరికింది.
విజేతను నిర్ణయించేది బస్తీ వాసుల ఓట్లే ..
దాన్ని కారణంగా చూసి హైకోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు దానం నాగేందర్‌ను అనర్హడుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓ ఎమ్మెల్యేను అనర్హత వేటు పడటం ఇదే మొదటిసారి. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. మరో ఆరు నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. ఇక్కడ బస్తీ వాసుల ఓట్లే కీలకం కానున్నాయి. ఖైరతాబాద్ స్థానాన్ని గతంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఇక్కడ గెలిచాయి.దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమే. పైగా మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది.
మూడు ప్రధాన పార్టీల కసరత్తు..
ఇదిలా ఉంటే సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అటు కమలం పార్టీ మాత్రం ఖైరతాబాద్ తో ఈసారి ఎలాగైనా పాగా వేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావాలనే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి దానం బరిలో దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కైవం చేసుకుంది. ఆ రెండు స్థానాలకు అభ్యర్ధులు చనిపోవడంతో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ దానం పరిస్థితి మాత్రం అతనిపై అనర్హత వేటు వేసింది కోర్టు. మరి కోర్టు అనర్హత వేటు వేసిన అభ్యర్ధి దానంనే కాంగ్రెస్ పార్టీ బరిలో దింపడం దాదాపు ఖాయమనే పరిస్థితి ఉంది. ఇక తమ అభ్యర్ధులను ఖరారు పనిలో బీఆర్ఎస్, బీజేపీ పడినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ తరుపున గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రాంచంద్రారెడ్డినే బరిలో దింపనున్నట్టు తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ మన్నె గోవర్ధన్ రెడ్డిని బరిలో దింపుతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఖైరతాబాద్ బై పోల్‌తో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి.