• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Rajagopal Reddy: క్యారెక్టర్‌లో, క్రెడిబిలిటీలో నేను సీఎంకన్నా ఎక్కువ.. మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

Rajagopal Reddy: క్యారెక్టర్‌లో, క్రెడిబిలిటీలో నేను సీఎంకన్నా ఎక్కువ.. మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

Rajagopal reddy fire on cm revanth reddy: అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి కూడా నిధుల కోసం అడుక్కొవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 03, 2026, 01:18 PM IST|Updated: Nov 03, 2026, 01:26 PM IST
joinshare
Rajagopal Reddy:  క్యారెక్టర్‌లో, క్రెడిబిలిటీలో నేను సీఎంకన్నా ఎక్కువ.. మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
Image Credit: cmrevanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఏపీ మున్సిపల్ ఫలితాల్లో  క్లీన్ స్వీప్ దిశగా కూటమి..?

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో క్లీన్ స్వీప్ దిశగా కూటమి..?

2

బీపీ మాత్రలు వేసుకోవడం మరిచిపోతున్నారా? ఒక్క డోసు మిస్ అయితే జరిగే ప్రమాదం ఇదే..!!

3

Bihar: ఛీ.. ఛీ.. ప్రియుడితో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన తల్లి.. తమ కామవాంఛకు కొడుకు అడ్డుగా ఉన్నాడని ఘోరం.!.

4

2 నెలలుగా అమ్మానాన్నలకు దూరంగా బాలుడు.. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు!

5

Rajagopal Reddy: క్యారెక్టర్‌లో, క్రెడిబిలిటీలో నేను సీఎంకన్నా ఎక్కువ.. మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Komati reddy rajgopal reddy fires on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాకరేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా మంత్రి పదవిపై తరచుగా సీఎం రేవంత్ పై బహిరంగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శణాస్త్రాల్ని సంధిస్తున్నారు. ముఖ్యంగా తన నియోజక వర్గం డెవలప్ మెంట్ కు నిధులు కేటాయించక పోవడంపై కాంగ్రెస్ స్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ఇటీవల అయిష్టంగానే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్‌కు మంత్రా లేదా తెలంగాణకు మంత్రా? అర్ధం కావడం లేదు! గతంలో బీఆర్ఎస్ వాళ్ళు పూడిక తీసిన చెరువుల్లో ఉన్న నీళ్ళే ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతున్నాయి! మొత్తం నిధులన్నీ కూడా కోదాడ, హుజూర్ నగర్‌కే తీసుకుపోతున్నాడు అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే లాగా నిధులు అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మన కర్మ! - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

— AadyaTV Telugu (@aadyatvtelugu) November 3, 2026

 

మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోమటిరెడ్డి విమర్శలు సంధిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో నియోజక వర్గాలకు వనరుల కేటాయింపులో అపోసిషన్ పార్టీ నేతల్లా అడుక్కొవాల్సి వస్తుందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సైతం విమర్శలు గుప్పించారు.  నిధులన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్‌కే తీసుకెళ్తున్నారు. ఆయన తెలంగాణకు మంత్రా.. హుజూర్‌నగర్‌కే మంత్రా?.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పూడిక తీసిన చెరువుల్లో నీళ్లు నిలిచి ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతున్నాయన్నారు.

నేను చాలా పవర్ఫుల్ అని వాళ్లకు తెలుసు.. అందుకే నాకు మంత్రి పదవిఇస్తలేరు.. అదే విధంగా తన నియోజక వర్గంకు నిధులు కూడా ఇవ్వడం కూడా లేరన్నారు. తాను మంత్రిని, సీఎంను కాకపోయిన క్యారెక్టర్ లో, క్రెడిబిలిటీలో వారికన్న కూడా గొప్పనేతను అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తన అసహానంను వ్యక్తం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Telangana News
Telugu News