SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rajgopal Reddy: కాంగ్రెస్‌లో మంచితనాన్ని కూడా ఓర్చుకోలేరు.. సీఎం రేవంత్ పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy: తన నియోజకవర్గం కోసం మనసుని చంపుకుని మరీ రేవంత్‌ని కలిశానంటూ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. భట్టి విక్రమార్క దగ్గరకు కూడా వెళ్లి నిధులు ఇవ్వాలని కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 02, 2026, 02:17 PM IST | Updated: Nov 02, 2026, 02:27 PM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

Komati Reddy rajgopal Reddy slams on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే తరచుగా మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ పై తరచుగా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు తన మునుగోడు నియోజక వర్గం కోసం కావాలిస్తే పదవికి రాజీనామా చేయడానికైన రెడీ అంటూ తెల్చి చెప్పారు. ఈ క్రమంలో తాజాగా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో స్థానికంగా డెవలప్ మెంట్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిధుల విషయంలో, మంత్రి పదవిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన మునుగొడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేనప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండటం దండగేనంటూ మాట్లాడారు. నాకు మంత్రి పదవి ఇస్తే.. ఎక్కడికో వెళ్లిపోతానన్న అక్కసుతోనే కొంత మంది తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పుల్లలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మంచితనాన్ని కూడా ఓర్చుకోలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి.. మోసం చేసిన రేవంత్ దగ్గరికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు కానీ.. నియోజకవర్గం కోసం మనసుని చంపుకుని మరీ రేవంత్‌ని కలిశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు కూడా వెళ్లి నిధులు ఇవ్వాలని కోరినా.. వాళ్లు నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా.. నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా ప్రభుత్వంతో కొట్లాడుతున్నానని వాపోయారు.

టెండర్లు పిలిచి రోడ్లు వేయిస్తున్నారు.. కానీ బిల్లులు రాక మధ్యలోనే పనులు ఆపేసి కాంట్రాక్టర్లు వెళ్లిపోతున్నారన్నారు. జీతాలకు, రైతు బంధు వంటి పథకాలకు నిధులు ఇచ్చేందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కనీసం.. రోడ్డు వేసుకోవడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వడం లేదని, ప్రస్తుత పనులే బిల్లులు రాక ఆగిపోయాయి.. ఇక కొత్త పనులు ఎలా మొదలవుతాయని మండిపడ్డారు.

నిధుల కోసం ప్రభుత్వంతో కొట్లాడటానికి సిద్ధం.. ఇంకేం చేయడానికైనా నేను సిద్ధమేనన్నారు. ఆఖరికి.. నా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడానికి కూడా నేను రెడీనేఅంటూ క్లారిటీ ఇచ్చారు. నేను ఎంతో కష్టపడి పలువురిని ఎమ్మెల్యే చేస్తే.. వాళ్లంతా నన్ను మోసం చేశారన్నారు. నేను రాజీ పడను, ఎవరికీ భయపడను.. నిధుల కోసం సాయశక్తులా పోరాడుతానన్నారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం రాకపోవడం వల్లే మన అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలతో తన గొడును చెప్పుకున్నారు. మొత్తంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారంగా మారాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES