SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KTR: ఉద్యమ శిఖరం కేసీఆర్‌ను దూషించి రేవంత్ రెడ్డి పైశాచికానందం: కేటీఆర్

Revanth Reddy Dont Have Right To Talk About Telangana Martyrs: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక కల్పవృక్షం అయితే రేవంత్‌ రెడ్డి కలుపు మొక్క అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభివర్ణించారు. ఉద్యమ ద్రోహి రేవంత్‌ రెడ్డికి అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. సిద్దిపేటలో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 19, 2026, 23:26 IST | Updated: Nov 19, 2026, 23:26 IST
Image Credit: Source: KTR Facebook
Join

KTR vs Revanth Reddy: ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాడి సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషించి రేవంత్‌ రెడ్డి పైశాచిక ఆనందం పొందాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తలెఇపారు. ఉద్యమ శిఖరం కేసీఆర్‌పై తీవ్రమైన పదజాలంతో విమర్శించడాన్ని ఖండించారు. కేసీఆర్‌ను కల్పవృక్షంగా అభివర్ణిస్తూ.. రేవంత్ రెడ్డి ఒక కలుపు మొక్క అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ఉద్యమ శిఖరం కేసీఆర్‌ను దూషించి పైశాచిక ఆనందం పొందడం తప్ప మరేమీ చేయలేరు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

'రైతుల బాధలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోత భాష మాట్లాడుతున్నారు. కరువులు, కన్నీళ్లతో ప్రజలు అల్లాడుతుంటే చిల్లర మాటలతో చిందులా? తెలంగాణలో నీళ్ల దోపిడీ జరుగుతుంటే నిద్ర నటిస్తూ, నిజాలు చెప్పేవారిపై నిందలా?' అని రేవంత్‌ రెడ్డి తీరుపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహికి అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం సిద్ధిపేట, సిరిసిల్లలా గర్జించి కాంగ్రెస్‌కు సమాధి కట్టడం ఖాయం అని రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

సిద్దిపేట బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి చేసిన అసభ్య, నీచపు ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్‌' వేదికగా తీవ్రంగా స్పందించారు. రైతుల సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యలను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి బాధ్యతారహితమైన, రోత భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. కరువులు, కన్నీళ్లతో ప్రజలు అల్లాడుతుంటే రేవంత్‌ రెడ్డి చిల్లర మాటలతో చిందులు తొక్కడం ఏమిటని ప్రశ్నించారు. 'తెలంగాణలో నీళ్ల దోపిడీ జరుగుతుంటే నిద్ర నటిస్తూ.. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్న వారిపై నిందలు మోపడం ఏమిటి' అని నిలదీశారు. తెలంగాన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి.. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి వైఖరిపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు.

'జై తెలంగాణ అని అనలేని ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న సిరిసిల్లలో, నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు.. పిచ్చి ప్రేలాపనలు చేయడం మినహా రేవంత్‌ రెడ్డి రాష్ట్రానికి చేస్తున్న మేలు ఏమిటని ప్రశ్నించారు. బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలకు నాలుగు మంచి పనులు.. మంచి మాటలు చెప్పాలని హితవు పలికారు. కానీ రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని  అసహనం వ్యక్తం చేశారు.

'ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పథకాలకు పాతరేస్తూ.. అవినీతి జాతర కొనసాగిస్తూ అబద్ధాలు, అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తారు' అని బీఆర్‌ఎస్‌ పార్ట వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి నియోజకవర్గం సిద్ధిపేట, సిరిసిల్ల తరహాలో గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES