• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KTR Tweet: కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరు మారదు.. రాహుల్ గాంధీ పర్యటనపై కేటీఆర్ సంచలన ట్విట్..

KTR Tweet: కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరు మారదు.. రాహుల్ గాంధీ పర్యటనపై కేటీఆర్ సంచలన ట్విట్..

ktr fires on cm revanth reddy: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా రెండు జాతీయ పార్టీల అగ్రనేతలకు తెలంగాణ నేతలు బాడీగార్డులుగా మారిపోయారని సెటైర్లు వేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 15, 2026, 15:49 IST|Updated: Nov 15, 2026, 16:05 IST
joinshare
KTR Tweet: కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరు మారదు..  రాహుల్ గాంధీ పర్యటనపై కేటీఆర్ సంచలన ట్విట్..
Image Credit: ktr(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ktr satirical tweet on cm revanth reddy and Telangana bjp leaders: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు బీజేపీ సైతం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తునే ఉంది. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన సమయంలో  బీజేపీ చీఫ్ రామ చందర్ రావ్ ఆయనకు శాలువు వేసి కాళ్లకు నమస్కరించడం రచ్చగా మారిన విషయం తెలిసిందే. తాజాగా.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్ లోని ఏఐసీసీలో  జరిగిన  భారత్ సమ్మిట్ కార్యక్రమంకు హజరయ్యేందుకు వచ్చారు. దీనిలో భాగంగా గిగ్ వర్కర్లకు అండగా పలు ప్రకటనలు చేశారు. 

ఈ క్రమంలో ర్యాలీలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్కూటీపైన వెళ్తుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,   మంత్రి వివేక్ వెంకట స్వామిలు ఆయన వెంట పరిగెడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అంతే కాకుండా వేదికపై కూడా సీఎం రేవంత్ రెడ్డి బాడీగార్డుగా అందర్ని పక్కకు నెట్టుకుంటూ ఎంపీ రాహుల్ గాంధీని వేదికమీద స్పీచ్ కు రూట్ క్లియర్ చేయడంపై కూడా తీవ్ర రచ్చ రాజుకుంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు.   

రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో .. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేకంగా బాడీగార్డులుగా మారారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు వారి పదవులకు ఉన్న హుందాతనం కాపాడుకొవడం రాదని సెటైర్లు వేశారు.   రాహుల్ గాంధీ వెనుక ఆ పరుగెత్తడం ఏంటని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు కూడా బీజేపీ నేతలు ఇదే విధంగా చేశారన్నారు.

 గతంలో బండి సంజయ్ చెప్పులు మోస్తే, ఇటీవల రామ చందర్ రావు అమిత్ షా కాళ్లకు దండం పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీ పార్టీ నేతల కాళ్ల మీద పడి ఇక్కడి నేతలు మన గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ , బీజేపీ నేతల తీరు తెలంగాణకు సిగ్గుచేటని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
Revanth Reddy
Congress
Telangana News