SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ రైతులకు బిగ్ అప్‌డేట్.. మీ భూమి సర్వే అయ్యిందా? మారనున్న కొత్త రూల్స్ ఇవే..!!

Land Resurvey: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఆటంకాలు ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

Written By Bhoomi
Published: Nov 12, 2026, 02:11 PM IST | Updated: Nov 12, 2026, 02:13 PM IST
Image Credit: Land Resurvey:
Join

Land Resurvey: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఆటంకాలు   ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP)లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కీలక మార్పులు చేయనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.  బుధవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు.. సర్వే అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వే.. గృహ నిర్మాణ పథకాల పురోగతిపై మంత్రి సమీక్ష జరిపి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎస్ఓపి ప్రకారం పునఃసర్వే సజావుగా సాగుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో అధికారులు స్థానిక పరిస్థితులను బట్టి విభిన్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ విషయంలో, క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి అనుభవాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పునఃసర్వే పద్ధతుల్లో మార్పులు చేయనున్నారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

భూ యజమానులకు అవగాహన, 22ఏ భూముల పరిష్కారం:
సర్వే పూర్తయిన తర్వాత, తమ అభ్యంతరాలను ముందుగానే తెలియజేయడానికి ఉన్న అవకాశాల గురించి భూ యజమానులకు అవగాహన కల్పించాలి. నోటీసులు జారీ చేసిన తర్వాత, ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో నోటీసులను అతికించాలి, తద్వారా రైతులకు ఎలాంటి అపార్థాలు లేకుండా పూర్తి సమాచారం అందేలా చూడాలని ఆదేశించారు.  రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులను గుర్తించడంలో గందరగోళాన్ని నివారించడానికి, రెండు శాఖల అధికారులు కలిసి పనిచేయాలి.

స్తంభింపజేసిన జాబితా (22A)లోని భూములకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేసినప్పటికీ, కొన్ని జిల్లాల్లో సమస్యలు కొనసాగుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పునర్‌సర్వేలో అద్భుతమైన పనితీరు కనబరిచిన నల్గొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను మంత్రి అభినందించారు. అయితే, నిజామాబాద్ జిల్లాలో సర్వే పనులు నెమ్మదిగా సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

సాంకేతిక వనరుల పెంపులో భాగంగా, రాష్ట్రంలోని ప్రతి డివిజన్‌కు రెండు సర్వే బృందాలు, రెండు రోవర్ల చొప్పున మొత్తం 708 రోవర్లను ప్రస్తుతం సర్వే కోసం వినియోగిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 141 రెవెన్యూ గ్రామాల్లో భారీ స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. పనులను వేగవంతం చేసేందుకు వచ్చే వారం మరో 400 రోవర్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.

రాష్ట్రంలో ఏ దశలోనైనా రెండు పడకగదుల (డబుల్ బెడ్‌రూమ్) ఇంటికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వెంటనే కేటాయించాలి. ఇందిరమ్మ గృహ పథకం ద్వారా పేదలకు త్వరగా ప్రయోజనం చేకూరాలి. ముఖ్యంగా వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, హనుమకొండ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూమిని వెంటనే గుర్తించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి  కలెక్టర్లను ఆదేశించారు.

Also Read: 

 

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

 

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES