SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను ఆటోలో తీసుకెళ్లి.!.

Woman raped in Hyderabad: మహిళకు మాయ మాటలు చెప్పి జూబ్లిహిల్స్ లోని చెట్ల వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి అత్యాచారంకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 17, 2026, 12:36 PM IST | Updated: Oct 17, 2026, 12:48 PM IST
Image Credit: Hyderabadcrime(file)
Join

Woman assaulted and raped in Hyderabad: దేశంలో ఇటీవల మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్న కూడా కామాంధుల్లో మార్పులు రావడంలేదు. పసిపాప నుంచి పండు ముసలి వరకు అత్యాచారాలకు గురౌతున్నారు. నిత్యం మహిళలపై దాడులు వార్తలలో ఉంటున్నాయి. బస్టాండ్ లు, మెట్రోలు, రద్దీ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మహిళలకు వేధింపులబారిన పడుతున్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


హైదరాబాద్ లోని జూబ్లి హిల్స్ పరిధిలో ఉంటున్న మహిళ పనికోసం రాయదుర్గంలో పలువురిని సంప్రదించింది. ఆ తర్వాత ఆమె రాయదుర్గం నుంచి తన ఇంటికి వెళ్తుండగా ఆమెను ఒక వ్యక్తి గమనించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అప్పటికే అతను పక్కా ప్లాన్ తో ఆటోతో రెడీగా ఉన్నాడు. మహిళతో మాట్లాడి తనకు కొన్ని ఇండ్లు తెలుసని వారి ఇంటిలో పని ఇప్పిస్తానని చెప్పాడు. కనీసం తన భర్తకు చెప్పి వస్తానంటూ ఆమెను కంగారు పెట్టాడు. మాయ మాటలు చెప్పి, ఆమెను ఆటో ఎక్కించుకున్నాడు. ఆతర్వాత జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ - 51కు తీసుకెళ్లాడు.  

చెట్లు దట్టంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెను కిందకు దింపి పొదల్లోకి లాక్కెళ్లాడు. ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తమ ఇంటికి వచ్చి తన భర్తకు జరిగిన దారుణాన్ని చెప్పింది. ఈ క్రమంలో జూబ్లిహిల్స్ పీఎస్ కు వెళ్లి  జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని జల్లెడపడుతున్నారు.

బాధిత మహిళను.. అమీర్‌పేట యూసీహెచ్‌కు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులు జూబ్లిహిల్స్ ప్రాంతంలో రాత్రిపూట గస్తీని పెంచారు. హైదరాబాద్ లో తరచుగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు వార్తలలో ఉండటంపై ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి పూట నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES