SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nizamabad: పోలీస్ స్టేషన్‌లో నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

Man suicide attempt in bheemgal: పోలీసులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని సుధాకర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నిజామాబాద్ భీమ్‌గల్ పీఎస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన దుమారంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 05, 2026, 01:37 PM IST | Updated: Oct 05, 2026, 01:44 PM IST
Image Credit: ManSuicideAttemptinBheemgalPoliceStation
Join

Man burn himself and suicide attempt in bheemgal police station: సమాజంలో పోలీసులను ఎంతో గౌరవంగా చూస్తారు. ముఖ్యంగా శాంతి భద్రతలను కాపాడటం కోసం రాత్రనక, పగలనక పనిచేస్తారు. అంతే కాకుండా తమ వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టి పనిచేస్తుంటారు. ఈ క్రమంలో  కొంత మంది పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తారు. అంతే కాకుండా ఫిర్యాదుల కోసం వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తిస్తారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తారు.  

 

 

ఇక కొంత మంది అయితే ప్రతినెల మాముళ్లు వసూలు చేస్తు డిపార్ట్ మెంట్ కే చెడ్డ పేరువచ్చేలా ప్రవర్తిస్తారు. దీంతో పోలీసుల వేధింపులతో కొంత మంది బాధితులు పీఎస్ లోనే సూసైడ్ లకు యత్నించడం చేస్తారు. కొంత మంది ఇలాంటి పనులు చేసిన మొత్తంగా డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు వస్తుంది.  అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నిజామాబాద్ లోని భీమ్ గల్ పరిధిలో చోటు చేసుకుంది.

 

నిజామాబాద్ భీమ్‌గల్ పీఎస్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.  భీమ్‌గల్ పట్టణంలో హోటల్ నడుపుకుంటున్న సుధాకర్ పీఎస్ కు వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. దీంతో అరుపులు, కేకలు పెట్టడంతో అక్కడున్న స్థానికులు, పోలీసులు మంటలను ఆర్పేశారు. అయితే.. బాధితుడు   రాత్రి 10 గంటల తరవాత హోటల్ బయట పెట్టిన టేబుళ్లను తీయమని వేధిస్తున్నారని ఆరోపించాడు. 

ఇంకోసారి తప్పు చేయనని బ్రతిమాలిడిన పట్టించుకోలేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో తనపై భీమగల్  ఎస్ఐ తిరుపతి  కేసు నమోదు చేయడంతో మనస్తాపంకు గురైనట్లు చెప్పాడు. ఈరోజు కోర్టు కు వెళ్లాలంటూ పోలీస్ స్టేషన్ కి పిలవడంతో... ఆత్మహత్యాయత్నం చేసినట్లు సుధాకర్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సుధాకర్  పరిస్థితి విషమం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పీఎస్ లో చోటు చేసుకొవడంతో డిపార్ట్ మెంట్ లో తీవ్ర కలకలంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES