• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /జీరో నుండి ఆకాశమంత ఎత్తు వరకు.. సమాజ భాగస్వామ్యంతో ఒక వెలుగు వెలిగిన మేకల మండి సర్కారు బడి ప్రస్థానం..!!

జీరో నుండి ఆకాశమంత ఎత్తు వరకు.. సమాజ భాగస్వామ్యంతో ఒక వెలుగు వెలిగిన మేకల మండి సర్కారు బడి ప్రస్థానం..!!

Mekala Mandi Govt School Secunderabad: ఒకప్పుడు కనీసం అంగుళం సొంత స్థలం లేక.. కమ్యూనిటీ హాళ్లలో కాలం వెళ్లదీసి.. చివరకు ప్రభుత్వ ఉత్తర్వులతో మూతపడిన పాఠశాల అది.

Written ByBhoomi
Published: Nov 18, 2026, 11:51 IST|Updated: Nov 18, 2026, 15:10 IST
joinshare
జీరో నుండి ఆకాశమంత ఎత్తు వరకు.. సమాజ భాగస్వామ్యంతో ఒక వెలుగు వెలిగిన మేకల మండి సర్కారు బడి ప్రస్థానం..!!
Image Credit: Mekala Mandi Govt School

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mekala Mandi Govt School Secunderabad: ఒకప్పుడు కనీసం అంగుళం సొంత స్థలం లేక.. కమ్యూనిటీ హాళ్లలో కాలం వెళ్లదీసి.. చివరకు ప్రభుత్వ ఉత్తర్వులతో మూతపడిన పాఠశాల అది. ఒక్క టేబుల్, మూడు కుర్చీలు, ఒక బీరువాతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆ బడి.. నేడు వెయ్యి గజాల సువిశాల ప్రాంగణం, మూడు అంతస్తుల భవనాలు, 750 మంది విద్యార్థులతో కళకళలాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తోంది. సముద్రపు కెరటంలా ఎగిసిపడి ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాల  స్థాయికి చేరిన సికింద్రాబాద్ మేకల మండి ప్రభుత్వ పాఠశాల చారిత్రక ప్రస్థానం అందరికీ ఆదర్శప్రాయం.

1969లో కమ్యూనిటీ హాళ్లలో ప్రారంభమైన ఈ పాఠశాల.. 1998లో బోయిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విలీనమైంది. ఒకే ప్రాంగణంలో రెండు బడులు నడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 2000 సంవత్సరంలో బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు కె. మల్లికార్జున్ రెడ్డి తోటి సిబ్బంది  బదరి నారాయణ రావు, ఏ.త్రినేత్రిలతో కలిసి సొంత భవనం కోసం నడుం బిగించారు. 2006లో న్యూ బోయిగూడ (న్యూ బోలక్‌పూర్)లోని సామూహిక మరుగుదొడ్ల స్థలంలో బడి నిర్మించాలని ప్రయత్నించినా స్థానిక అడ్డంకులతో ఆగిపోయింది.

ఇదే సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ ఒకే ప్రాంగణంలో ఉన్న 282 పాఠశాలలను మూసివేయగా..అందులో మేకల మండి బడి కూడా ఉంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన  జిల్లా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. పబ్లిక్ గార్డెన్‌లో సీఎం, కలెక్టర్ల సమావేశం ముట్టడి, ఆమరణ నిరాహార దీక్షల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది. ఖాళీ ప్రభుత్వ స్థలాలు చూపిస్తే బడులను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.

స్థల సాధనలో అలుపెరగని కృషి:

అప్పటి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాఠశాలకు భూమిని కేటాయించారు.  ఉపాధ్యాయురాలి భర్త, ఎమ్మార్వో చంద్రారెడ్డి, డిప్యూటీ ఐఓఎస్ వివేకావతిల కృషితో 2008లో కలెక్టర్ స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 200 గజాల్లో నిర్మాణం కుదరదని ఎస్ఎస్ఏ అధికారులు అభ్యంతరం చెప్పినా.. అప్పటి ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డిల సహకారంతో ఆటంకాలు తొలగాయి. 2009లో నిర్మాణం మొదలై 2011 జూన్‌లో ప్రారంభమైంది. ఆ సమావేశంలో అప్పటి ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రూ.5 లక్షలు మంజూరు చేయగా.. ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కార్పొరేటర్ సావిత్రి మహేష్‌ల చొరవతో బడి వెనుక కబ్జాలో ఉన్న మరో 220 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కోర్టు స్టేలను దాటుకుంటూ.. భవనాల నిర్మాణం:
2013లో ప్రజావాణిలో ఇచ్చిన వినతికి స్పందించిన అప్పటి కలెక్టర్ నటరాజన్ గుల్జార్ మరో 600 గజాల స్థలాన్ని కేటాయించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి ఎస్ఎస్ఏ రూ.6 లక్షలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో రూ.6 లక్షలు మంజూరు చేసినా.. కొందరు వ్యక్తులు రెండుసార్లు హైకోర్టు నుండి స్టే తెచ్చారు. అయితే, ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), రెవెన్యూ, విద్యాశాఖ అధికారుల సహకారంతో స్టేలను ఎత్తివేయించి.. ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి చొరవతో 2017లో ప్రహరీ గోడ పూర్తి చేశారు.

విద్యార్థుల సంఖ్య పెరగడంతో కేంద్ర మాజీ మంత్రి..బండారు దత్తాత్రేయ(రూ.25 లక్షలు), ఎమ్మెల్సీ వాణీ దేవి (రూ.25 లక్షలు), ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల నిధులతో ఒకటి, రెండు బ్లాకులు నిర్మితమయ్యాయి. అనంతరం  హైస్కూల్ సాధన కమిటీ  విజ్ఞప్తి మేరకు మంత్రి తలసాని రూ.1.85 కోట్లు, తన నియోజకవర్గ నిధుల నుండి మరో రూ.65 లక్షలు మంజూరు చేయించారు. నిబంధనల ప్రకారం 6 గదులే వస్తాయని అధికారులు చెప్పినా.. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మంత్రి పట్టుబట్టి 16 అదనపు తరగతి గదులను మంజూరు చేయించారు. 2025లో నూతన భవనం అందుబాటులోకి వచ్చి 8వ తరగతి ప్రారంభమైంది. ఈ ఏడాది 2026లో  స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గార్ల సహకారముతో హై స్కూల్  గా అప్ గ్రేడ్ ఉత్తర్వులు వచ్చినాయి.

రికార్డుల మోత.. అంకితభావమే ఆయుధం:
2011–12లో పూర్వ ప్రాథమిక తరగతుల్లో 120 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే అత్యధిక ప్రవేశాలు కలిగిన పాఠశాలగా రికార్డు సృష్టించింది. 2015 నుండి 2024 వరకు ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో సుమారు 180 మంది విద్యార్థులు గురుకుల సెట్‌లో సీట్లు సాధించారు. స్థానిక జర్నలిస్టు మొయినుద్దీన్.. E చంద్ర శేఖర్,B నర్సింగరావు, VJ శేషగిరి రావు , రాజు,P గోపికృష్ణ, భారత్ భూషణ్ లతో కూడిన మేకల మండి ప్రభుత్వ అభివృద్ధి కమిటీ (MGSDC) ఏర్పాటైంది. రాష్ట్రంలో ప్రభుత్వ రిజిస్టర్డ్ అభివృద్ధి కమిటీ ఉన్న ఏకైక బడి ఇదే కావడం విశేషం.

సమిష్టి కృషికి జేజేలు:
తొలి దాత పి.గోపికృష్ణ (జేసీఐ), ఎన్టీపీసీ డీజీఎం రాజేందర్, సహా దాదాపు 100 మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఫర్నిచర్, ఇతర వసతులు సమకూర్చారు. కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, ఎస్ఎంసీ ఛైర్మన్లు నర్సింగ్ రావు ఆర్య, పుల్లారావు సహకరించారు. అధికారుల మందలింపులు, కోర్టు కేసులు, ఎండవానలను లెక్కచేయకుండా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, దాతలు, తల్లిదండ్రులు కలిసికట్టుగా చేసిన ఈ అక్షర యజ్ఞం.. నేడు వందలాది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

Also Read: 

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ రద్దుపై కీలక అడుగు..త్వరలో ప్రత్యేక అధ్యయన కమిటీ..!!

ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలుపై సీఎం హామీ.. కానీ జీవో ఇప్పుడే ఇవ్వాలి: శ్రీపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Employees