• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /BRS Party: దానం నాగేందర్‌పై వేటు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది: పాడి కౌశిక్‌ రెడ్డి

BRS Party: దానం నాగేందర్‌పై వేటు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది: పాడి కౌశిక్‌ రెడ్డి

MLA Padi Kaushik Reddy Hot Comments On Rahul Gandhi: తమ రెండున్నరేళ్ల పోరాటం తర్వాత దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం అని చెప్పారు. రాహుల్ గాంధీకి కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదేనని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 24, 2026, 06:45 PM IST|Updated: Sep 24, 2026, 06:54 PM IST
joinshare
BRS Party: దానం నాగేందర్‌పై వేటు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది: పాడి కౌశిక్‌ రెడ్డి
Image Credit: Padi Kaushik Reddy

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Danam Nagender Disqualify: 'కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి. చిల్లరగాళ్లు, బ్రోకర్‌గాళ్లు తీర్పు తర్వాత చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్‌గా తీసుకోవాలి అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. 'మందికి పుట్టిన బిడ్డలు తమ బిడ్డలు అన్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మిగతా ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎందుకు పోరాడలేదు' అని ప్రశ్నించారు. '14 మార్చి 2024న దానం నాగేందర్ కాంగ్రెస్‌కు అమ్ముడు పోయారు. 18 మార్చి 2024న స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. 21 మార్చి 2024న దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. 10 ఏప్రిల్ 2024న హైకోర్టుకు వెళ్లాం. జూలై నుంచి విచారణ ప్రారంభమైంది' అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం అని ప్రకటించారు. 'పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత  కోసం 24 మార్చి 2024 నుంచి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ పోరాడుతోంది. పిటిషన్ వేసిన నాడే దానం నాగేందర్‌పై వేటు పడుతుందని చెప్పాం' అని వివరించారు.

'జనవరిలో నేను.. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మళ్లీ కోర్టుకెళ్లాం. జూలై  2025లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇంట్లో ఉంటారా జైల్లో ఉంటారా కూడా స్పీకర్‌కు వార్నింగ్ ఇచ్చింది. 11 మార్చి 2026న స్పీకర్ దానం నాగేందర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశాం. 18 సెప్టెంబర్ 2026 హైకోర్టు దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. అదే రోజు సుప్రీంకోర్టులో కేవియట్ వేశాం. ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్నే సమర్ధించింది' అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివరించారు.

రెండున్నరేళ్ల తమ పోరాటం తర్వాత దానం నాగేందర్‌పై వేటు పడిందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. పోరాటం చేసింది బీఆర్ఎస్సా? బీజేపీనా? ప్రశ్నించారు. సిగ్గులేకుండా ఇపుడు తమ ఘనత అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు తర్వాత నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లనని చెప్పి మరుసటి రోజే మాట మార్చారు. కాంగ్రెస్ ఖైరతాబాద్‌లో ఓడిపోతుందని తెలిసే సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు.

'రేవంత్ రెడ్డికి ఎలాగు సిగ్గు శరం లేదు. రాహుల్ గాంధీకి కూడా లేదా?. రాహుల్ గాంధీకి కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదే' అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది పై కూడా వేటు తప్పదని జోష్యం చెప్పారు. త్వరలోనే ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయని ప్రకటించారు. 'ఖైరతాబాద్‌లో 22ఏ ప్రభావం ఉంటుంది. నిరుద్యోగులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తారు' అని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక జీవితంలో వార్డు సభ్యులుగా కూడా గెలవరని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
BRS
KCR
Hyderabad
Telangana News