• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Jagtial: నేనొస్త.. భయమేస్తుంది.. జగిత్యాల చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో తల్లిదండ్రుల్ని హత్తుకుని ఏడుస్తున్న పసివాడు.. వీడియో..

Jagtial: నేనొస్త.. భయమేస్తుంది.. జగిత్యాల చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో తల్లిదండ్రుల్ని హత్తుకుని ఏడుస్తున్న పసివాడు.. వీడియో..

Three year old child in jagtial: తల్లిదండ్రులను చూడగానే బాలుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. నేనొస్త తీసుకెళ్లాలని ఏడ్వడం అందర్ని కలిచి వేసింది. జగిత్యాల శిశు సంక్షేమ శాఖ కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 02, 2026, 06:31 PM IST|Updated: Nov 02, 2026, 06:46 PM IST
joinshare
Jagtial: నేనొస్త.. భయమేస్తుంది.. జగిత్యాల చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో తల్లిదండ్రుల్ని హత్తుకుని ఏడుస్తున్న పసివాడు..  వీడియో..
Image Credit: Jagtial three year child news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?

వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?

2

Savings Plan: ప్రతినెలా ఎంత ఆదా చేయవచ్చు? క్వాలా ఇంటెల్‌తో సులభతరం

3

GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

4

Tirumala: ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్‌ అథారిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ..

5

Bigg Boss Neha Fathima: బిగ్‌బాస్‌లో లేడీ కంటెస్టెంట్ ప్రేమాయణం..ఏకంగా షో‌లోకి వచ్చేసిన తల్లీదండ్రులు..షాకింగ్ మూమెంట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Three year old child cries for parents in jagtial: జగిత్యాల జిల్లాలో శ్రీనివాస్, సరిత అనే దంపతులు శిశు సంక్షేమ కేంద్రంకు వెళ్లగా మూడేళ్ల బాలుడు వీరిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను తీసుకెళ్లాలని, ఇక్కడ ఉండనని తల్లిదండ్రుల్ని గట్టిగా హత్తుకుని ఏడ్వడం అందర్ని కలిసి వేసింది. అయితే అధికారులు మాత్రం పిల్లాడ్ని తీసుకెళ్లడానికి అంగీకరించలేద. దీనివెనుక అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.  గత కొన్నేళ్ల క్రితం శ్రీనివాస్, సరితలు తమకు సంతానం లేకపొవడంతో బాలుడ్ని తమ సమీప బంధువుల నుంచి దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి బాలుడ్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అప్పటి నుంచే ఆ చిన్నారి బాలుడే తమ లోకంగా భావించి జీవిస్తున్నారు.అయితే ఇటీవల బాలుడిని దత్తత తీసుకొవడంతో చట్టబద్దంగా దత్తత తీసుకొలేదని కొంత మంది చైల్డ్ కేర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మూడేళ్ల బాలుడ్ని వచ్చి తీసుకెళ్లారు. 

 

హైకోర్టు ఆదేశించినా తల్లిదండ్రులకు దక్కని చిన్నారి.. ‘అమ్మా...నన్ను తీసుకెళ్లు’ అంటూ కన్నీరుమున్నీరు! జగిత్యాల జిల్లాలో మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదన్న కారణంతో అధికారులు తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. చిన్నారిని చూసేందుకు కేంద్రానికి వెళ్లిన తల్లిదండ్రుల ఎదుట "నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది" అంటూ ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపించడం కలచివేసింది. హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్‌ 16న చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు చిన్నారిని అప్పగించడంలో జాప్యం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమకు అప్పగించాలని కోరుతున్నారు. #Jagtial #ChildWelfare #HighCourtOrder #AdoptionCase

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 2, 2026

 

అప్పటి నుంచి మూడేళ్ల బాలుడు శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆధీనంలో ఉన్నాడు. దీనిపై మూడేళ్ల బాలుడి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు సైతం ఈ దంపతుల తరపు లాయర్  బాలుడ్నిదత్తత తీసుకున్నారని చేసిన వాదనలతో ఏకీభవించింది. చిన్నారి భవిష్యత్తు, మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 16వ తేదీన ఆ బాలుడ్ని మరల పెంచిన తల్లిదండ్రులకు అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రోజులు గడుస్తున్న కూడా

శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉద్దేషపూర్వకంగా బాలుడ్ని తమకు అప్పగించడంలేదని వాపోతున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్న కూడా తమ కొడుకును అప్పగించక పోవడంపై తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు బాలుడు తల్లిదండ్రుల్ని చూసి తనను తీసుకెళ్లాలని, ఇక్కడ భయమేస్తుందని వారిని హత్తుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు అధికారుల తీరును విమర్శిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Karimnagar
Telangana News
Telugu News