• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Irrigation Water: తెలంగాణ రైతులకు సీఎం కీలక సూచన.. 'నీళ్లు ఇవ్వలేం.. రెండో పంట వేయొద్దు'

Irrigation Water: తెలంగాణ రైతులకు సీఎం కీలక సూచన.. 'నీళ్లు ఇవ్వలేం.. రెండో పంట వేయొద్దు'

One Drop Irrigation Water Also Not Available To Farmers: తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని.. రైతులకు చుక్క నీరు ఇవ్వలేమని ప్రకటించారు. రైతులు ఎవరూ పంటలు వేయరాదని సూచించారు. మరికొన్ని రైతులకు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 23, 2026, 08:17 PM IST|Updated: Oct 23, 2026, 08:22 PM IST
joinshare
Irrigation Water: తెలంగాణ రైతులకు సీఎం కీలక సూచన.. 'నీళ్లు ఇవ్వలేం.. రెండో పంట వేయొద్దు'
Image Credit: Revanth Reddy Press Meet

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bollywood Actor: డ్యాన్స్ ఫ్లోర్ నుంచి సినిమా తెర వరకు.. ఈ హిందీ నటుడి ప్రయాణం స్ఫూర్తిదాయకం!

Bollywood Actor: డ్యాన్స్ ఫ్లోర్ నుంచి సినిమా తెర వరకు.. ఈ హిందీ నటుడి ప్రయాణం స్ఫూర్తిదాయకం!

2

Irrigation Water: తెలంగాణ రైతులకు సీఎం కీలక సూచన.. 'నీళ్లు ఇవ్వలేం.. రెండో పంట వేయొద్దు'

3

Tummidihatti Project: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన.. త్వరలోనే మహారాష్ట్రతో చర్చలు

4

AP Elections: రంగంలోకి డీఐజీ ప్రవీణ్‌.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు

5

Samantha Ruth Prabhu: సమంత లక్కీ ఛార్మ్ ఆ హీరోనే.. ఆయనంటే చాలా ఇష్టంట!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Elnino Effect To Telangana: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మరోసారి రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఎల్‌నినో అంటే ఏదో భూతం కాదని కరువు అని తెలిపారు. నీళ్లు అందుబాటులో ఉండవని.. మళ్లీ పంట వేయరాదని రేవంత్‌ రెడ్డి సూచించారు. కరువు ప్రారంభమైనప్పుడు దాని ప్రభావం అంతగా తెలియదని పేర్కొన్నారు. కరువుపై తాము ఆరు నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.

'30 లక్షల పంప్‌సెట్లలో 15 లక్షలు ఎండిపోయాయి. వచ్చే సీజన్‌లో చుక్క నీరు కూడా దొరకదు. ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవు. 200 టీఎంసీల నీళ్లు కూడా లేవు.. డెడ్ స్టోరేజీకి చేరాయి. తాగునీటికి తప్ప సాగుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఈ విషయాన్ని దాచిపెడితే క్యాన్సర్‌లా మారుతుంది. 8 నుంచి 10 నెలల పాటు ఈ కరువును ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం నిజాలను ప్రజలకు వెల్లడించకపోతే అన్ని రకాలుగా దెబ్బతింటామని ఆందోళన వ్యక్తం చేశారు. 'వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం జరగదు.. ఆరుతడి పంటలు, కూరగాయల సాగు మాత్రమే చేయాలి' అని రైతులకు సూచించారు.

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ తెచ్చిన కరువు అని, కాంగ్రెస్‌తోనే కరువు వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో కూడిన ప్రకటనలు కొందరు చేస్తున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు చేశారు. మామ, అల్లుళ్లు మాత్రమే మేధావులా? బ్రిటన్ లాంటి దేశంలో కూడా ఎల్‌నినో వల్ల కరువును ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటిని రేషన్‌లా ఇస్తున్నారని.. ప్రతి మనిషి 20 శాతం నీటి వినియోగాన్ని తగ్గించాలనే నిబంధనలు పెట్టారని వెల్లడించారు.

'దేశంలోని మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని 100 దేశాలపై ఎల్‌నినో ప్రభావం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు కరువును ఎదుర్కొన్నాయి. ఎండ వేడి విపరీతంగా పెరుగుతుంది.. నీళ్లు అందుబాటులో ఉండవు. ఎండ వేడి, నీటి కొరతతో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'ప్రకృతి వైపరీత్యాలు మూడు రకాలు.. కరువు, వరదలు, భూకంపాలు. వీటిని మనం నివారించలేం. భూకంపంతో అపార నష్టం జరుగుతుంది. కరువు ప్రారంభమైనప్పుడు దాని ప్రభావం అంతగా తెలియదు. కరువుపై ఆరు నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

'అక్టోబర్‌లో మొదలైన కరువు జూలై వరకు ఉంటుంది. ఎండ వేడి పెరుగుతుంది.. నీటి ఆవిరి పెరుగుతుంది.. నీటి సమస్య వస్తుంది. సాగునీటి కంటే తాగునీటికే కష్టాలు వస్తాయి. సమస్య చిన్నగా మొదలై పెద్దదిగా మారుతుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలను అప్రమత్తం చేయకుండా, వారిని భాగస్వాములను చేయకుండా ఈ కరువును ఎదుర్కోలేం' అని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

'2019లో కరోనా వచ్చింది. కరోనా గురించి అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎండ కొడితే, క్రోసిన్ వేసుకుంటే పోతుందని కేసీఆర్ దబాయించి మాట్లాడారు. కరోనాను సీసాలో వేసి బంధిస్తానన్నట్లుగా కేసీఆర్ మాట్లాడారు. లక్షలాది మంది కరోనాతో చనిపోయారు. శ్మశానాల్లో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు నమ్మారు. బాధ్యత లేకుండా కరోనాపై మాట్లాడటంతో చాలా మంది శ్మశానాలకు వెళ్లారు. కేసీఆర్ మాటలు నమ్మినవాళ్లు ఈ రోజు బతికి ఉన్నారు' అని చెప్పారు.

'కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్న హరీశ్ రావును నమ్ముకుని పంటలు వేసుకుంటే, మట్టి పోసి అంబలి తాగాల్సి వస్తుంది' అని రైతులను రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. ప్రజల్లో అవగాహన కల్పించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. 'కరోనా సమయంలో మోదీ ఏం చెప్పినా చేశాం. ప్రకృతి సృష్టించిన విపత్కర పరిస్థితి ఎల్‌నినో. వానాకాలంలో ఎలాంటి సమస్య లేదు. కానీ మూడు నెలల తర్వాత సమస్యలు మొదలయ్యాయి. వానాకాలం పంటల నుంచి బయటపడ్డాం' అని తెలిపారు.

విద్యుత్‌ విషయమై స్పందిస్తూ.. 'ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ సీజన్‌లో 13 వేల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం కాలేదు. ఈ సీజన్‌లో 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ప్రతి ఏడాది ఆరున్నర శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈసారి ఊహించకుండా 20 శాతం వరకు విద్యుత్ వినియోగం పెరిగింది. అధికారులు 24 గంటలు కష్టపడి విద్యుత్ సరఫరా చేస్తున్నారు' అని వెల్లడించారు. 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. వానాకాలం పంటలను ఏదో రకంగా రక్షిస్తామని.. కొనుగోలు చేస్తామని తెలంగాణ సీఎం ప్రకటించారు.

వరి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. 'ఏడు రకాల సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని గత సీజన్‌లో చెప్పాం. సన్న వడ్లను ఏడు రకాలకే పరిమితం చేయడం బోనస్ ఎగ్గొట్టడానికేనని హరీశ్ రావు ఆరోపించారు. మార్కెట్‌లో రూ.3,400 నుంచి రూ.4,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు అడ్వాన్స్‌లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు నమ్మి ఏడు రకాల సన్న వడ్లు పండించినందుకు అత్యధిక ధర వచ్చింది' అని తెలిపారు. 'కేటీఆర్, హరీశ్ రావు బద్నాం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుని ప్రణాళికలు వేస్తే, కేటీఆర్, హరీశ్ రావు అమలు చేస్తున్నారు. మనిషి పెరిగితే ఆలోచన పెరుగుతుందని అనుకోవడం అవగాహన రాహిత్యమే' అని విమర్శించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Trending News
Politics